Owaisi in West Bengal Elections 2026: పశ్చిమ బెంగాల్ ఎన్నికల బరిలో ఒవైసీ.. ఏకంగా 182 స్థానాల్లో పోటీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Owaisi in West Bengal Elections 2026: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. రాష్ట్రంలో కొత్త కూటమి ఏర్పడింది.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని AIMIM పార్టీ, హుమాయున్ కబీర్ నేతృత్వంలోని ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (AJDUP)తో కలిసి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. మార్చి 25న కోల్‌కతాలో నిర్వహించనున్న సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ పొత్తుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. ఈ కూటమి ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణం కనిపించే అవకాశముంది.
Read Also: Astrology: మార్చి 23, సోమవారం దినఫలాలు.. ఇవాళ ఏ రాశి వారు ఏ పరిహారం చెల్లించాలి..?
Also Read
- Central Government Funds: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఏపీ, తెలంగాణకు భారీగా నిధులు..
- Digvijaya Singh: "హిందూత్వం సమాజంలో ద్వేషాన్ని పెంచుతుంది".. దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
- Supreme Court: తిరుపతి లడ్డూ కల్తీ కేసు.. విచారణను ఏపీ వెలుపలికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Jantar Mantar: ఢిల్లీ పోలీసుల పవర్ ఫుల్ నిర్ణయం.. 20 ఏళ్ల తర్వాత తెరుచుకున్న జంతర్ మంతర్ రోడ్డు..
హుమాయున్ కబీర్ పార్టీ ఇప్పటికే పెద్ద సంఖ్యలో స్థానాల్లో పోటీ చేయాలని సంకేతాలు ఇచ్చింది. AIMIM కూడా పరిమిత సంఖ్యలో స్థానాల్లో పోటీ చేసే అవకాశముందని సమాచారం. ముఖ్యంగా ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకుని వ్యూహాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. రాణినగర్, భగవాన్‌గోలా, ముర్షిదాబాద్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే అభ్యర్థుల ప్రకటనలు వెలువడుతున్నాయి. ఈ పరిణామాలు స్థానిక రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశముంది. పశ్చిమ బెంగాల్లో ప్రధాన పోటీ సాధారణంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) మరియు భారతీయ జనతా పార్టీ మధ్య కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో AIMIM-కబీర్ కూటమి “మూడవ శక్తి”గా ఎదగాలని ప్రయత్నిస్తోంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ కూటమి ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో ఓటు విభజనకు దారితీసి ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశముంది.
తాజావార్తలు
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!
-
IND vs SL 1st ODI: బీసీసీఐ కీలక నిర్ణయం.. విశాఖలో తొలి వన్డే.. వేదిక మార్పుకు కారణం ఇదే!
-
AP Local Body Elections: ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రీపోలింగ్ స్టార్ట్..
-
Brendan Taylor: 40 ఏళ్ల వయసులో బ్రెండన్ టేలర్ సెంచరీ.. 8 ఏళ్ల నిరీక్షణకు తెర.. టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు..!
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!