Site icon NTV Telugu

Harish Rao: నువ్వేం.. ముఖ్యమంత్రివి..? సీఎంపై మాజీ మంత్రి ఫైర్

Harish Rao

Harish Rao

Harish Rao: కామారెడ్డి జిల్లా, నాగిరెడ్డిపేటలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నాయకుడు హరీష్ రావు, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి నేడు (అక్టోబర్ 5) పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులను వారు పరామర్శించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీష్ రావు ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే స్థానిక ఇన్చార్జ్ మంత్రుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Hit and Run: మదం తలకెక్కితే.. ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు అరెస్ట్

“వరద బాధితులను ఆదుకోలేని నువ్వేం ముఖ్యమంత్రివి?” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నేరుగా ప్రశ్నించారు బీఆర్‌ఎస్‌ నాయకుడు హరీష్ రావు. కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో వరద బాధితులను ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చి నెల రోజులు గడుస్తున్నా, ఇప్పటివరకు నయా పైసా కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. అలాగే ఇన్చార్జ్ మంత్రి సీతక్కకు పట్టింపు లేదు, ముఖ్యమంత్రికి సోయి లేద అంటూ మంత్రుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపారు. ఒక్క కామారెడ్డి జిల్లాలోనే 40,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వెల్లడించారు.

పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.25,000 నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ” అని విమర్శించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపైనా హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రిగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారని, కానీ ఒక ఎకరానికి నీళ్లు ఇవ్వలేదని, ఒక ప్రాజెక్టు కట్టలేదని, ఒక చెక్ డ్యాం కట్టలేదని విమర్శించారు.

Illegal Liquor: నకిలీ మద్యం కేసులో కీలకంగా మారిన లిక్కర్ డైరీ.. లిస్టులో ప్రముఖుల పేర్లు!

అలాగే పోచారం కాలువ సమస్య: పోచారం కాలువ మీద ఆధారపడ్డ పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగి పంట కూడా పోచారం కాలువ మీద ఆధారపడి వ్యవసాయం జరుగుతుంది కాబట్టి, వెంటనే కాలువలోని గండ్లను పూడ్చాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక రైతుల సమస్యల విషయంలో ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని హరీష్ రావు ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరించారు.

Exit mobile version