NTV Telugu Site icon

AP Bandh: అంగన్వాడీలకు మద్దతుగా 24న రాష్ట్ర బంద్‌కు పిలుపు

Ap Bandh

Ap Bandh

AP Bandh: అంగన్వాడీలకు మద్దతుగా ఏపీ బంద్‌కు రాష్ట్ర అఖిలపక్ష ట్రేడ్‌ యూనియన్లు పిలుపునిచ్చాయి. 24వ తేదీన అంగన్వాడీలకు మద్దతుగా రాష్ట్ర బంద్ జయప్రదం చేయాలని పిలుపును ఇచ్చాయి. అంగన్వాడీలకు సంఘీభావంగా రాష్ట్ర బంద్ చేయడం అవసరమని రాష్ట్ర అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు భావించాయి. ఈ పిలుపును రాష్ట్ర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పౌరహక్కుల సంఘాలు, ప్రజాస్వామిక వాదులు, వివిద వర్గాల ప్రజలు బలపరచాలని విజ్ఞప్తి చేశారు. ఈ బంద్‌ను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.రవీంద్రనాథ్‌, ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పి.ప్రసాద్, టీఎన్టియూసీ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామరాజు, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర నాయకులు క్రాంతికుమార్, తదితరులు పత్రికా ప్రకటనను విడుదల చేశారు.

Read Also: Merugu Nagarjuna: చంద్రబాబు హయాంలో దళితులపై జరిగిన దాడులు దేశంలో ఎక్కడా జరిగి ఉండవు..

మరోవైపు.. దీక్షలో కూర్చున్న అంగన్వాడీలను అర్ధరాత్రి అన్యాయంగా అరెస్టు చేశారని ఏపీ అంగన్వాడీల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి తీవ్రంగా మండిపడ్డారు. మహిళలని చూడకుండా రోడ్డుపై ఈడ్చి పారేసిన చర్యలను ఖండిస్తున్నామన్నారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం కోటి సంతకాల సేకరించి సీఎంకు అందించాలని భావించామన్నారు. ఎన్ని అరెస్టులు చేసినా మా పోరాటం కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు. అనేక పోలీస్ స్టేషన్లకు తరలించినా అక్కడ కూడా మా అంగన్వాడీలందరూ ఆందోళన చేపడుతున్నారన్నారు. ఎంత దూరం వదిలేసినా మళ్లీ విజయవాడ వచ్చి ఉద్యమం కొనసాగించి తీరుతామన్నారు. అంగన్వాడీ మహిళలందరూ కూడా ఇళ్లకు వెళ్ళవద్దన్నారు. ఎక్కడ అయితే అరెస్టు లో ఉన్నారో అక్కడే నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. స్టేషన్ నుంచి వదిలిన వెంటనే మళ్లీ విజయవాడ తరలి రావాలని కోరుతున్నామన్నారు. మా ఉద్యమాన్ని అంచివేయాలని పోలీసులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. నాయకులు కోట్ల రూపాయలు వసూళ్లు చేస్తున్నారని అంటున్నారని.. పోలీసులు వాటిని నిరూపిస్తే… ఆ కోటి వాళ్లకే ఇస్తామన్నారు. పోలీసులు చేస్తున్న ప్రచారాన్ని మేము ఖండిస్తున్నామన్నారు. అంగన్‌వాడీలను తొలగించి, ఇరవై వేల మందిని కొత్తగా నియమించామని అబద్దాలు చెబుతున్నారని.. అంగన్వాడీ మహిళా ఉద్యమాల వెనుక ఎటువంటి రాజకీయ శక్తులు లేవన్నారు. హక్కులు సాధించుకునే వరకు ఈ పోరాటం, ఉద్యమం కొనసాగుతుందన్నారు.

Show comments