NTV Telugu Site icon

AP New Excise Policy: అక్టోబర్‌ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం విధానం

Andhra Pradesh

Andhra Pradesh

AP New Excise Policy: ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్‌ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం విధానం కానుంది. కొత్త మద్యం విధానంపై కీలక విషయాలను మంత్రివర్గ ఉపసంఘం మీడియా సమావేశంలో వెల్లడించింది. కేబినెట్‌ సబ్‌ కమిటీలో సభ్యులైన మంత్రులు కొల్లురవీంద్ర, నాదెండ్ల మనోహర్ , సత్య ప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్‌లు సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. 6 రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలను పరిశీలించామని వారు తెలిపారు. గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపులు ఇస్తామన్నారు. కొత్త మద్యం పాలసీని రేపు కేబినెట్ ముందుపెడతామన్నారు. గత ప్రభుత్వంలో మద్యం ధరలను విపరీతంగా పెంచారని విమర్శించారు. మద్యం రేట్ పెరగడంతో పేదలు గంజాయికి అలవాటుపడ్డారన్నారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ఇస్తామని మంత్రివర్గ ఉపసంఘం పేర్కొంది.

Read Also: Purandeswari: వైజాగ్‌ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం ఉద్దేశం అదే.. పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు

ఏపీలో మధ్యం విధానం పై ఏర్పాటైన సబ్ కమిటీ అయిదుగురు మంత్రులతో సీఎం ఏర్పాటు చేశారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గతంలో మధ్యం వ్యవస్థను వారి గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి ఎక్సైజ్ వ్యవస్ధను నాశనం చేశారని ఆయన అన్నారు. 70 శాతం మందితో ఎస్‌ఈబీ అని పెట్టి ఎన్‌ఫోర్స్‌మెంట్ లేకుండా చేశారన్నారు. ప్రభుత్వ షాపుల్లో జే బ్రాండ్‌లను మాత్రమే అందుబాటులో ఉంచి విచ్చలవిడిగా దోచేశారని ఆరోపించారు. మద్యపాన నిషేదం అని దశలవారీగా ఎత్తేస్తామని చెప్పి పదేపదే మాటమార్చారన్నారు. విపరీతమైన రేట్లు పెట్టి సామాన్యులను అప్పులు పాలు చేశారని.. సామాన్యుల ఆధాయాన్ని దోపిడీ చేశారని విమర్శించారు.

ఈ దోపిడీ ఆదాయం వారి జేబుల్లోకి వెళ్ళిపోయిందని.. అర్హత లేని వ్యక్తిని డిప్యూటేషన్‌పై తెచ్చి దోచేశారని ఆరోపించారు. నాశిరకం అయిన బ్రాండ్స్ తెచ్చి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నారని, చాలామంది అనారోగ్యం పాలయ్యి చాలామంది మృత్యువాత పడ్డారని అన్నారు. “డిస్టలరీల వ్యవస్ధను మొత్తం వారి చేతుల్లోకి తీసుకున్నారు. షాపులలో 150 ది ఉందా 200 ది ఉందా అని అడగాల్సి వచ్చింది. నాశిరకం మద్యం తాగలేక నాటుసారా, ఎన్‌డీపీఎల్‌లకు వెళ్లిపోయారుతెలంగాణ, తమిళనాడు, ఒడిశా నుండి ఎక్కవ మద్యం రాష్ట్రానికి వచ్చింది. 1994 తరువాత ఏపీలో పాలసీ దేశానికే ఆదర్శం అయ్యింది. ఇప్పడు ఆరు రాష్ట్రాలకు వెళ్లి అక్కడ పాలసీ, టాక్సేషన్ విధానంపై అధ్యయనం చేశాం. కల్లుగీత కార్మికులకు 10శాతం షాపులు ఇస్తామని చెప్పాము. ఈరోజు నాల్గవ సమావేశం అయ్యింది. రేపు క్యాబినెట్ ముందు మా ప్రతిపాదనలను సరసమైన ధరలకు నాణ్యంమైన మధ్యం అందించాలని నిర్ణయించాం. రేట్లు పెంచడం వల్ల చాలామంది గంజాయికి, డ్రగ్స్‌కు డైవర్ట్ అయ్యారు.మరోవైపు మద్యం నియంత్రణకు కొంత ఫండింగ్ ఇవ్వాలని నిర్ణయించాం.” అని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

 

Show comments