\రాయలసీమలో అప్పర్ భద్ర ప్రాజెక్టు చిచ్చురేపుతోంది. అప్పర్ భద్ర ప్రాజెక్టు రాయలసీమకు మరణ శాసనం లాంటిది అన్నారు మాజీ ఎమ్మెల్యే,బీజేపీ రాష్ట్ర నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. నంద్యాలలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి పంగనామాలు కాదు రాయలసీమ అభివృద్ధి చెందాలన్నారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. మూడు రాజధానులు పేరిట ఏపీ ప్రజలకు మూడు నామాలు పెడుతున్నారని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. వివేకానంద రెడ్డి కేసులో ఇరుక్కొని వాటి వాసన కడుక్కోలేకపోతున్నారు.
Read Also: K. Viswanath: కళాతపస్వికి నీరాజనం!
ఏపీ అభివృద్ధి కోసం పాటుపడకుండా మూడు ముక్కలాట రాజధానుల కోసం కృషి జగన్ తహతహలాడుతున్నాడన్నారు. అప్పర్ భద్ర ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలనే కేంద్ర నిర్ణయం తప్పు అన్నారు. మూడు రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోకుండా అప్పర్ భద్ర ప్రాజెక్టును నిర్మించాలనుకోవడం అన్యాయం అన్నారు. అప్పర్ భద్ర ప్రాజెక్టు రాయలసీమకు మరణశాసనం లాంటిదే అని అభిప్రాయపడ్డారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. అప్పర్ భద్రా ప్రాజెక్టును వెంటనే ఆపాలన్నారు రాజశేఖరరెడ్డి..రాజకీయాలు ముఖ్యం కాదు నాకు రాయలసీమ అభివృద్ది ముఖ్యం అన్నారు బైరెడ్డి రాజశేఖరరెడ్డి..
పార్టీలకతీతంగా అందరూ ఈ ఉద్యమంలో పాల్గొనాలన్నారు బైరెడ్డి. ఈనెల 28న సేవ్ రాయలసీమ పేరుతో చలో ఆదోని లో భారీగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కర్నూలు నుంచి 25న మొదలుపెట్టే పాదయాత్రలో ప్రజలు భారీగా పాల్గొనాలన్నారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి.
Read Also: Jayamangala Venkata Ramana: సీఎం జగన్ తో జయమంగళ వెంకటరమణ భేటీ