మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతిపక్షాల మనుగడ కష్టమేనని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆరోపించారు. 370 సీట్లు గెలుస్తాం అని బీజేపీ స్పష్టంగా చెప్తోంది… జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ కాబట్టి బీజేపీ అలా అంటుందని విమర్శించారు. జమ్మూ కాశ్మీర్ను విభజించి ముక్కలు చేశామని బీజేపీ గొప్పగా చెప్పుకుంటుంది.. లౌకికవాదం, ప్రజాస్వామ్యం, విదేశీ సంస్థలకు దేశాన్ని అమ్మడం గొప్ప విజయంగా బీజేపీ భావిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ రాజ్యాంగాన్ని ఖూనీ చెయ్యడం కూడా గొప్ప విజయమే అంటుందని విమర్శించారు. 146 మంది ఎంపీలను పార్లమెంట్ నుంచి గేంటేసి, 19 బిల్లులను బీజేపీ ఆమోదం తెలిపిందని అన్నారు.
Mohammed Shami: గుజరాత్ టైటాన్స్కు భారీ షాక్.. ఐపీఎల్ 2024కు షమీ దూరం
ప్రజలు స్వేచ్ఛగా జీవించే హక్కును అరించివేసింది బీజేపీనని పేర్కొన్నారు. మీడియా స్వేచ్ఛను ఇప్పటికే అణిచివేస్తున్నారు.. కొత్తగా మరో యాక్ట్ తెస్తున్నారని అన్నారు. ఎలక్షన్ కమిషన్ లో చాలా లోపాలు ఉన్నాయి… ఈసీ స్వయంప్రతిపత్తిని తీసివేసే కుట్ర చేస్తున్నారని బీవీ రాఘవులు మండిపడ్డారు. బీజేపీకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఒక నాటకం అయింది.. ఎన్నికల ఖర్చు తగ్గించాలని హిట్లర్ చెప్పిన మాటలను బీజేపీ ఆచరణలో అమలు చేసే కుట్ర చేస్తోందని అన్నారు. నిరంకుశ, నియంత, అధ్యక్ష తరహా పాలన జరిపేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.
Madhya Pradesh: స్నేహితుడిని పెళ్లి చేసుకునేందుకు లింగమార్పిడి ఆపరేషన్.. తర్వాత ఏమైందంటే..!
ప్రపంచం అంతా తిరిగి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారు.. వన్ ఎలక్షన్ ను అంబేద్కర్ వ్యతిరేకించారని అన్నారు. అమెరికా లాంటి దేశంలో సమాఖ్య స్ఫూర్తి ఉంది అందుకే అభివృద్ధిలో ముందుందని బీవీ రాఘవులు తెలిపారు. ప్రస్తుతం దేశాన్ని, ప్రజాస్వామ్యన్ని డబ్బు శాసిస్తుంది.. ఎన్నికల బాండ్స్ ను ఆనాడే సీపీఎం వ్యతిరేకించింది.. ఇపుడు సుప్రీంకోర్టు చెప్పిందని పేర్కొన్నారు. ఎలక్ట్రోరల్ బాండ్స్ కు తాము వ్యతిరేకం… సీపీఎం ఇప్పటికీ బాండ్స్ తీసుకోలేదని చెప్పారు. దేశాన్ని ఎలక్షన్ బజార్ గా చేసింది బీజేపీనని దుయ్యబట్టారు.