NTV Telugu Site icon

Pushpa 2: పుష్ప కంటే రెండింతలు.. అదరగొట్టిన పుష్ప-2 హిందీ రైట్స్

Pushpa 2 Climax

Pushpa 2 Climax

Pushpa 2: పుష్ప ది రైజ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు హీరో అల్లు అర్జున్. ఈ సినిమాలో అల్లు హీరో నటన అందరినీ విస్మయానికి గురి చేసింది. ముఖ్యంగా తగ్గేదేలే అంటూ ఈ హీరో చేసిన మేనరిజం ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది. ఈ చిత్రంలో తన నటనకు ఉత్తమ నటుడిగా ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ జాతీయ అవార్డును కూడా కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం పుష్ప ది రైజ్‌కి సీక్వెల్‌గా పుష్ప 2 ద రూల్ రూపొందుతోంది. అల్లు అర్జున్‌-సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పుష్ప-2 నుండి విడుదలైన టీజర్, రెండు పాటలు మంచి ఆదరణ పొందాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల కానుంది.

Read Also:Vande Bharat Train: మరోమారు వందేభారత్ రైలుపై రాళ్ల దాడి.. భయపడిపోయిన ప్రయాణికులు!

అయితే తాజాగా ఈ సినిమా పతాక సన్నివేశాల చిత్రీకరణ చాలా రహస్యంగా జరిగినట్టు సమాచారం. చిత్ర యూనిట్‌లో చాలా తక్కువ మందితో ఈ చిత్రీకరణ జరిగింది. సినిమాలో కీలకంగా భావిస్తున్న ఈ సీన్ సినిమా విడుదలయ్యే వరకు బయటకు రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పుష్ప ది రైజ్‌లోనూ సినిమా పతాక సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ అత్యంత గ్రాండ్ గా రూపొందిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ అందుకున్న భారీ విజయానికి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

Read Also:SWAG : ‘శ్వాగ్’ సూపర్ హిట్ గ్యారెంటీ : ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్

కాగా, ఈ సారి ‘పుష్ప-2’ మూవీపై ఉత్తరాదిన కూడా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా కోసం హిందీ బెల్ట్‌లో భారీ కాంపిటిటేషన్ నెలకొంది. తాజాగా పుష్ప-2 చిత్రానికి సంబంధించిన హిందీ రైట్స్‌ను మేకర్స్ అత్యంత భారీ ధరకు అమ్మినట్లుగా సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప తొలి భాగానికి ఇది రెండింతల రేటుగా వార్తలు వస్తున్నాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ‘పుష్ప-2’ మూవీపై నార్త్ ఆడియెన్స్ ఏ రేంజ్‌లో ఆసక్తిగా ఉన్నారో. పుష్ప-2 మూవీతో మరోసారి నేషన్‌వైడ్‌గా బన్నీ ట్రెండ్ సెట్టర్ అవుతాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Show comments