Pushpa 2: పుష్ప కంటే రెండింతలు.. అదరగొట్టిన పుష్ప-2 హిందీ రైట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2: పుష్ప ది రైజ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు హీరో అల్లు అర్జున్. ఈ సినిమాలో అల్లు హీరో నటన అందరినీ విస్మయానికి గురి చేసింది. ముఖ్యంగా తగ్గేదేలే అంటూ ఈ హీరో చేసిన మేనరిజం ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది. ఈ చిత్రంలో తన నటనకు ఉత్తమ నటుడిగా ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ జాతీయ అవార్డును కూడా కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం పుష్ప ది రైజ్‌కి సీక్వెల్‌గా పుష్ప 2 ద రూల్ రూపొందుతోంది. అల్లు అర్జున్-సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పుష్ప-2 నుండి విడుదలైన టీజర్, రెండు పాటలు మంచి ఆదరణ పొందాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల కానుంది.
Read Also:Vande Bharat Train: మరోమారు వందేభారత్ రైలుపై రాళ్ల దాడి.. భయపడిపోయిన ప్రయాణికులు!
Also Read
- Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
- SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. 'మిస్టర్ 360' అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
అయితే తాజాగా ఈ సినిమా పతాక సన్నివేశాల చిత్రీకరణ చాలా రహస్యంగా జరిగినట్టు సమాచారం. చిత్ర యూనిట్‌లో చాలా తక్కువ మందితో ఈ చిత్రీకరణ జరిగింది. సినిమాలో కీలకంగా భావిస్తున్న ఈ సీన్ సినిమా విడుదలయ్యే వరకు బయటకు రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పుష్ప ది రైజ్‌లోనూ సినిమా పతాక సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ అత్యంత గ్రాండ్ గా రూపొందిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ అందుకున్న భారీ విజయానికి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
Read Also:SWAG : ‘శ్వాగ్’ సూపర్ హిట్ గ్యారెంటీ : ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్
కాగా, ఈ సారి ‘పుష్ప-2’ మూవీపై ఉత్తరాదిన కూడా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా కోసం హిందీ బెల్ట్‌లో భారీ కాంపిటిటేషన్ నెలకొంది. తాజాగా పుష్ప-2 చిత్రానికి సంబంధించిన హిందీ రైట్స్‌ను మేకర్స్ అత్యంత భారీ ధరకు అమ్మినట్లుగా సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప తొలి భాగానికి ఇది రెండింతల రేటుగా వార్తలు వస్తున్నాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ‘పుష్ప-2’ మూవీపై నార్త్ ఆడియెన్స్ ఏ రేంజ్‌లో ఆసక్తిగా ఉన్నారో. పుష్ప-2 మూవీతో మరోసారి నేషన్‌వైడ్‌గా బన్నీ ట్రెండ్ సెట్టర్ అవుతాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
తాజావార్తలు
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!