Buying New AC Tips: ఎండలు మండిపోతున్నాయి.. ఏసీ కొంటున్నారా? ఇవి తప్పనిసరిగా తెలుసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Buying New AC Tips: అప్పుడే ఎండలు దంచికొడుతున్నాయి.. బయటకు వెళ్లాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది.. వేసవి కాలం దగ్గరపడుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో చాలా మంది తమ ఇళ్ల కోసం కొత్త ఎయిర్ కండీషనర్లు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారు. అయితే తొందరపాటు లేదా ఆఫర్ల ఆకర్షణలో కొన్నిసార్లు సరైన ఏసీని ఎంచుకోకుండా కొనేసి తర్వాత ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి కొత్త ఏసీ కొనుగోలు చేసే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి.
* గది పరిమాణానికి సరిపోయే టన్నేజ్ ఎంచుకోండి
ఏసీ కొనేటప్పుడు చాలా మంది చేసే ప్రధాన తప్పు తప్పు టన్నేజ్ ఎంపిక. గది పరిమాణాన్ని బట్టి 1 టన్ను లేదా 1.5 టన్ను ఏసీని ఎంచుకోవాలి. చిన్న గదులకు 1 టన్ను సరిపోతే, పెద్ద గదులకు 1.5 టన్ను లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ఏసీ అవసరం ఉంటుంది. అవసరానికి మించిన టన్నేజ్ ఎంచుకుంటే విద్యుత్ బిల్లు కూడా పెరుగుతుంది.
Also Read
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
- AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
- Trump-Meloni: ‘‘వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు’’.. ట్రంప్ పోస్టుకు ఇటలీ కౌంటర్..
- Team India Players: టీమిండియా ఆటగాళ్లలో మొదలైన భయం.. మా వంతు రాదని గ్యారెంటీ ఏంటి అంటూ..
* స్టార్ రేటింగ్‌ను తప్పకుండా చూడండి
ఏసీ కొనుగోలు చేసేటప్పుడు విద్యుత్ వినియోగం కూడా చాలా ముఖ్యమైన అంశం. Bureau of Energy Efficiency ఇచ్చే స్టార్ రేటింగ్‌ను తప్పకుండా పరిశీలించాలి. 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలు విద్యుత్‌ను ఎక్కువగా ఆదా చేస్తాయి. 3 స్టార్ ఏసీలు తక్కువ ధరలో దొరికినా, విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది.
* ఇన్వర్టర్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇవ్వండి
ప్రస్తుతం మార్కెట్‌లో ఇన్వర్టర్ టెక్నాలజీ ఉన్న ఏసీలు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇవి గది ఉష్ణోగ్రతను బట్టి కాంప్రెసర్ వేగాన్ని నియంత్రిస్తాయి. అందువల్ల విద్యుత్ వినియోగం తక్కువగా ఉంటుంది. ఫిక్స్‌డ్ స్పీడ్ ఏసీలతో పోలిస్తే ఇవి ఎక్కువగా విద్యుత్ ఆదా చేస్తాయి.
* కాపర్ కండెన్సర్ కాయిల్ ఎంపిక చేయండి
ఏసీ కొనేటప్పుడు 100 శాతం కాపర్ కండెన్సర్ కాయిల్ ఉన్న మోడల్‌ను ఎంచుకోవడం మంచిది. అల్యూమినియం కంటే కాపర్ వేడి మార్పిడిని వేగంగా చేస్తుంది. అలాగే కాపర్ కాయిల్ ఉన్న ఏసీలను మరమ్మతు చేయడం కూడా సులభం.
* సర్వీస్ సపోర్ట్‌ను కూడా పరిశీలించండి
ఏసీ కొనుగోలు చేసే ముందు ఆ కంపెనీ అమ్మకాల తర్వాత సేవలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. మంచి సర్వీస్ సపోర్ట్ ఉన్న కంపెనీలను ఎంచుకుంటే భవిష్యత్తులో సమస్యలు తక్కువగా ఉంటాయి. మొత్తంగా.. కొత్త ఏసీ కొనేటప్పుడు టన్నేజ్, స్టార్ రేటింగ్, ఇన్వర్టర్ టెక్నాలజీ, కాపర్ కండెన్సర్ కాయిల్, సర్వీస్ సపోర్ట్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే విద్యుత్ బిల్లును తగ్గించుకోవడంతో పాటు మంచి పనితీరు ఉన్న ఏసీని ఎంపిక చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్‌లో ఇంగ్లండ్‌ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!