తెలుగులో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది.గత ఏడాది మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఆయన కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘పోకిరి’ సినిమాని 4K రిజల్యూషన్ లో ఎంతో గ్రాండ్ గా విడుదల చేసారు.ఆ సినిమా ఏకంగా కోటి 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఆల్ టైం రికార్డు నెలకొల్పింది.. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ‘జల్సా’ సినిమాను రీ రిలీజ్ చేయగా ఆ సినిమా పోకిరి కలెక్షన్స్ ని అధిగమించింది.ఆ తర్వాత చాలా సినిమాలు విడుదల అయ్యాయి కానీ ఒక్కటి కూడా ఈ రెండు సినిమాల అంత ఇంప్యాక్ట్ ను క్రియేట్ చేయలేకపోయాయి.ఆ తరువాత పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఖుషి సినిమాని రీ రిలీజ్ చేసారు.ఈ చిత్రం రీ రిలీజ్ లో కూడా ప్రభంజనం సృష్టించింది.ఏ సినిమా అందుకోలేని అరుదైన రికార్డుని నెలకొల్పింది. మొదటి రోజు నాలుగు కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది.అలాగే ఫుల్ రన్ లో 8 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది.
ఈ సినిమా రికార్డ్స్ ని అధిగమించడానికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సింహాద్రి సినిమాను భారీ ప్రొమోషన్స్ తో అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేసి రీ రిలీజ్ చేసారు.కానీ పవన్ కళ్యాణ్ ఖుషి రికార్డు ని అధిగమించలేదు. దీనితో ఆగష్టు 9 మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు ‘బిజినెస్ మ్యాన్’ చిత్రాన్ని 4K లో ఎంతో గ్రాండ్ గా విడుదల చెయ్యబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ప్రాంతాలలో కూడా ప్రారంభించగా టికెట్స్ హాట్ కేక్ లాగా సేల్ అయ్యాయి..అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో మరోసారి మహేష్ ట్రెండ్ సృష్టించారు.దీనితో పవన్ కళ్యాణ్ సినిమా నెలకొల్పిన ఆ రికార్డ్ ను మహేష్ బిజినెస్ మాన్ సినిమా అధిగమిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.