Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు చేయాలని బెంగళూరు తిలక్‌నగర పీఎస్ పోలీసులను చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
Writeoff Loans: లోన్లు తీసుకున్నవాళ్లలో ప్రతిఒక్కరూ వాటిని పూర్తిగా తిరిగి చెల్లిస్తారనే గ్యారంటీ లేదు. దీంతో.. వివిధ కారణాల వల్ల కొన్ని రుణాలు మొండి బకాయిలుగా మారుతుంటాయి. నిరర్థక ఆస్తులుగా మిగిలిపోతాయి. మరికొన్నింటిని సాంకేతికంగా రద్దు చేస్తుంటారు. అంటే.. టెక్నికల్‌గా.. రైటాఫ్ చేస్తారు. ఫలితంగా.. కొందరు.. ఈ రుణాలను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదేమో అనుకుంటారు.
Business Headlines 24-02-23: BWA-తెలంగాణ ఒప్పందం: తెలంగాణ రాష్ట్రాన్ని నూతన సాంకేతిక పరిజ్ఞానంలో అగ్ర స్థానంలో నిలబెట్టే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్ల శాఖ శ్రీకారం చుట్టింది. వెబ్3 టెక్నాలజీ సంస్థ భారత్ వెబ్3 అసోసియేట్స్.. BWAతో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం BWA కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో సదస్సులు, ప్రదర్శనలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
Economic Survey 2023 Highlights: ఇవాళ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎకనమిక్ సర్వే-2023ను ప్రవేశపెట్టారు. ఈ సర్వే మన దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులకు అద్దం పట్టింది. వివిధ రంగాల గణాంకాలను సవివరంగా పొందుపరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆయా సెక్టార్ల పనితీరును ప్రతిబింబించింది. కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన వివిధ పథకాల గురించి, వాటి వల్ల వచ్చిన ఫలితాల గురించి స్పష్టంగా పేర్కొంది.
Business Today: డాక్టర్ రెడ్డీస్‌కి మరోసారి ప్రపంచ స్థాయి గుర్తింపు: హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ ఫార్మాస్యుటికల్ సంస్థ డాక్టర్ రెడ్డీస్ మరోసారి ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం పరిధిలోని గ్లోబల్ లైట్‌హౌజ్ నెట్‌వర్క్‌లో చోటు సంపాదించింది. భాగ్య నగరంలోని బాచుపల్లిలో ఈ సంస్థకు అతిపెద్ద మ్యానిఫ్యాక్షరింగ్ యూనిట్ ఉంది.