MP Bureaucrat Killed: నామినీగా చేయనందుకు.. ప్రభుత్వ ఉద్యోగి అయిన భార్యను హత్య చేసిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Bureaucrat Killed: ప్రభుత్వ అధికారిణి అయిన భార్యను భర్త హత్య చేశాడు. మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలోని షాపురాలో పోస్ట్ చేయబడిన మహిళా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM)ని సర్వీస్, ఇన్సూరెన్స్, బ్యాంక్ రికార్డులలో నామినీగా చేయనందుకు ఆమె భర్త ఆమెను హత్య చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి సోమవారం తెలిపారు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌ను సర్వీస్, ఇన్సూరెన్స్, బ్యాంక్ రికార్డులలో నామినీగా చేయనందుకు ఆమె భర్త దిండుతో ఊపిరాడకుండా నొక్కి చంపేశాడు. 51 ఏళ్ల నిషా నపిట్ షాపురాలో మహిళా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌గా విధులు నిర్వహిస్తోంది. మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయమైన 45 ఏళ్ల మనీష్ శర్మతో 2020లో పెళ్లి జరిగింది. అతనిని సర్వీస్, ఇన్సూరెన్స్, బ్యాంక్ రికార్డులలో నామినీగా చేయాలనే అతని డిమాండ్‌కు ఆమె అంగీకరించకపోవడంతో హత్య చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ అఖిల్ పటేల్ అన్నారు.
Read Also: Congress : ఆరు గ్యారెంటీలు అద్భుతం.. ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ కితాబు
Also Read
- కొత్త కలర్స్, TFT డిస్ప్లే, నావిగేషన్‌తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!
- Chittoor: చిత్తూరు జిల్లాలో అమానుష ఘటన.. తండ్రి మృతదేహానికి తలకొరివి పెట్టని కన్నకొడుకు.. కారణం ఏంటంటే?
- TSLPRB: తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలు.. ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ..
- గూర్ఖా రెజిమెంట్‌కు నివాళిగా కొత్త Royal Enfield Classic 350 Gorkha ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
మనీష్ శర్మ ఆదివారం ఆమెను దిండుతో ఊపిరాడకుండా చేసి, శవం దగ్గర ఆరు గంటలపాటు కూర్చుని, ఆపై మృతదేహాన్ని సమీపంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. అయితే అక్కడి వైద్యులు పోలీసులను అప్రమత్తం చేశారని ఎస్పీ తెలిపారు. మనీష్ శర్మ తన రక్తంతో తడిసిన బట్టలతో పాటు వాషింగ్ మెషీన్లో దిండును కూడా ఉతికినట్లు ఎస్పీ అఖిల్ పటేల్ వెల్లడించారు. ఏ ఉద్యోగం లేని అతడు డబ్బులు కోసం భార్యను వేధిస్తున్నాడని నిషా కుటుంబం ఆరోపించింది. అలాగే ప్రభుత్వ రికార్డులు, ఇన్సూరెన్స్, బ్యాంక్ రికార్డులలో నామినీగా చేయనందుకు ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో మనీష్ శర్మను అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 24 గంటల్లో కేసును ఛేదించినందుకు దర్యాప్తు బృందాన్ని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) ముఖేష్ శ్రీవాస్తవ అభినందించి రూ.20,000 రివార్డును ప్రకటించారు.
తాజావార్తలు
-
కొత్త కలర్స్, TFT డిస్ప్లే, నావిగేషన్‌తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!
-
Jailer 2 OTT Deal: రిలీజ్ కు ముందే రజనీకాంత్ ‘జైలర్ 2’ సంచలనం.. రూ.160 కోట్ల ఓటీటీ డీల్?
-
Chittoor: చిత్తూరు జిల్లాలో అమానుష ఘటన.. తండ్రి మృతదేహానికి తలకొరివి పెట్టని కన్నకొడుకు.. కారణం ఏంటంటే?
-
Vivo Y31T 5G: 7200mAh బ్యాటరీతో Vivo Y31T 5G.. 120Hz స్క్రీన్, 50MP కెమెరా.. ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఇవే
-
ED Summons : రామ్మా చిలకమ్మా.. నిధి అగర్వాల్ కు ఈడీ పిలుపు..
ట్రెండింగ్
-
గూర్ఖా రెజిమెంట్‌కు నివాళిగా కొత్త Royal Enfield Classic 350 Gorkha ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!
-
India All-Time Test XI: భారత్ ఆల్‌టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్.. కెప్టెన్‌గా కింగ్.. ధోనీ, జడేజాలకు షాక్!
-
9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!