ED Summons : రామ్మా చిలకమ్మా.. నిధి అగర్వాల్ కు ఈడీ పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల ప్రమోషన్ల వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) విచారణ మరింత వేగవంతమైంది. ఈ కేసు విచారణలో భాగంగా ప్రముఖ టాలీవుడ్ కథానాయిక నిధి అగర్వాల్‌కు ఈడీ అధికారులు ఇటీవల సమన్లు జారీ చేయగా నేడు బుధవారం ఈడీ కార్యాలయంలో అధికారుల ముందుకు హాజరుకానున్నారు.
గతంలో నమోదైన కేసు ఆధారంగా ఆర్థిక నేరాల కోణంలో ఈడీ ఈ దర్యాప్తును ముందుకు తీసుకెళ్తోంది. అక్రమ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు ప్రచారకర్తగా వ్యవహరించినందుకు గాను నిధి అగర్వాల్ భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నారని, ఆ డబ్బును హవాలా రూపంలో పొంది లెక్కల్లో చూపించలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆమె ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ ట్రాన్సాక్షన్లకు సంబంధించిన వివరాలపై ఈడీ అధికారులు ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నారు. సుమారు 14కు పైగా ఆన్లైన్ బెట్టింగ్, జూదం యాప్‌లకు ప్రచారం కల్పించిన కేసులో పలువురు సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ పిఎంఎల్ఏ (PMLA) చట్టం కింద విచారణ జరుపుతోంది. ఈ కేసులో ఇప్పటికే రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత సుభాష్, అనన్య నాగళ్ల వంటి పలువురు ప్రముఖులను అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నిధి అగర్వాల్ అందించే ఆధారాలు, ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా ఈడీ తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Also Read
- October Releases : అక్టోబర్‌లో మూవీ లవర్స్‌కు పండగే పండగ
- Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
- Impure : పెళ్లి కూతురు 'కన్య' కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న 'ఇంప్యూర్'!
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
తాజావార్తలు
-
UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
-
Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!
-
IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
-
Nethanna Bharosa: చేనేతలకు సర్కార్ మరో గుడ్ న్యూస్..
-
October Releases : అక్టోబర్‌లో మూవీ లవర్స్‌కు పండగే పండగ
ట్రెండింగ్
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!