Site icon NTV Telugu

MP Bureaucrat Killed: నామినీగా చేయనందుకు.. ప్రభుత్వ ఉద్యోగి అయిన భార్యను హత్య చేసిన భర్త

Madhyapradesh

Madhyapradesh

MP Bureaucrat Killed: ప్రభుత్వ అధికారిణి అయిన భార్యను భర్త హత్య చేశాడు. మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలోని షాపురాలో పోస్ట్ చేయబడిన మహిళా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM)ని సర్వీస్, ఇన్సూరెన్స్, బ్యాంక్ రికార్డులలో నామినీగా చేయనందుకు ఆమె భర్త ఆమెను హత్య చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి సోమవారం తెలిపారు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌ను సర్వీస్, ఇన్సూరెన్స్, బ్యాంక్ రికార్డులలో నామినీగా చేయనందుకు ఆమె భర్త దిండుతో ఊపిరాడకుండా నొక్కి చంపేశాడు. 51 ఏళ్ల నిషా నపిట్‌ షాపురాలో మహిళా సబ్‌ డివిజనల్ మేజిస్ట్రేట్‌గా విధులు నిర్వహిస్తోంది. మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయమైన 45 ఏళ్ల మనీష్ శర్మతో 2020లో పెళ్లి జరిగింది. అతనిని సర్వీస్, ఇన్సూరెన్స్, బ్యాంక్ రికార్డులలో నామినీగా చేయాలనే అతని డిమాండ్‌కు ఆమె అంగీకరించకపోవడంతో హత్య చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ అఖిల్ పటేల్ అన్నారు.

Read Also: Congress : ఆరు గ్యారెంటీలు అద్భుతం.. ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ కితాబు

మనీష్ శర్మ ఆదివారం ఆమెను దిండుతో ఊపిరాడకుండా చేసి, శవం దగ్గర ఆరు గంటలపాటు కూర్చుని, ఆపై మృతదేహాన్ని సమీపంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. అయితే అక్కడి వైద్యులు పోలీసులను అప్రమత్తం చేశారని ఎస్పీ తెలిపారు. మనీష్‌ శర్మ తన రక్తంతో తడిసిన బట్టలతో పాటు వాషింగ్ మెషీన్‌లో దిండును కూడా ఉతికినట్లు ఎస్పీ అఖిల్ పటేల్ వెల్లడించారు. ఏ ఉద్యోగం లేని అతడు డబ్బులు కోసం భార్యను వేధిస్తున్నాడని నిషా కుటుంబం ఆరోపించింది. అలాగే ప్రభుత్వ రికార్డులు, ఇన్సూరెన్స్, బ్యాంక్ రికార్డులలో నామినీగా చేయనందుకు ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో మనీష్‌ శర్మను అరెస్ట్‌ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 24 గంటల్లో కేసును ఛేదించినందుకు దర్యాప్తు బృందాన్ని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ) ముఖేష్ శ్రీవాస్తవ అభినందించి రూ.20,000 రివార్డును ప్రకటించారు.

Exit mobile version