ప్రభుత్వ అధికారిణి అయిన భార్యను భర్త హత్య చేశాడు. మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలోని షాపురాలో పోస్ట్ చేయబడిన మహిళా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM)ని సర్వీస్, ఇన్సూరెన్స్, బ్యాంక్ రికార్డులలో నామినీగా చేయనందుకు ఆమె భర్త ఆమెను హత్య చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి సోమవారం తెలిపారు.
ఉద్యోగం, ఆదాయం లేనందున తన భార్యకు భరణం చెల్లించలేనని భర్త చెప్పడం తగదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగం లేకపోయినా కూలి పనిచేసైనా విడాకులు తీసుకున్న భార్యకు భరణం చెల్లించాల్సిందేనని న్యాయస్థానం తీర్పునిచ్చింది. కూలి పనులు చేసైనా రోజుకు రూ.300 లేదా రూ.400 సంపాదించైనా భరణం చెల్లించాలని భర్తను కోర్టు ఆదేశించింది.