ఐపీఎల్ 2024లో భాగంగా.. గురువారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో బుమ్రా చెలరేగాడు. ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఫైవ్ వికెట్స్ ఆల్ సాధించిన తొలి బౌలర్గా బుమ్రా నిలిచాడు. తన 4 ఓవర్ల కోటాలో 21 పరుగులిచ్చి.. 5 వికెట్స్ పడగొట్టాడు. ఈ క్రమంలో.. మ్యాచ్ అనంతరం బుమ్రా యువ బౌలర్లకు కొన్ని సూచనలు ఇచ్చాడు. తన బౌలింగ్ స్కిల్స్ గురించి చెప్పాడు.
Read Also: PM Modi: అతి త్వరలో జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా.. ప్రధాని మోడీ..!
బుమ్రా యువ బౌలర్లకు చిట్కాల గురించి మాట్లాడుతూ.. ‘టీ20 ఫార్మాట్‌లో బౌలింగ్ చేయడం బౌలర్లకు చాలా కష్టం. నేను ఎప్పుడూ ఒకటే ట్రిక్ ఉపయోగించను’. అని తెలిపారు. మీరు బౌలింగ్ బాగా చేస్తున్నప్పుడు.. అభిమానులు మీ నుండి ఎంతో ఆశిస్తారని చెప్పారు. ‘ బౌలింగ్ లో నేను విభిన్న నైపుణ్యాలను కలిగి ఉండాలనుకుంటున్నాను. పరాజయాలను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు బౌలింగ్ చేయడం కష్టంగా మారుతుంది. మరుసటి రోజు నేను బౌలింగ్ చేసిన వీడియోను చూసి విశ్లేషించుకుంటాను’ అని తెలిపారు.
Read Also: Rohit Sharma: కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన రోహిత్ శర్మ..
బౌలింగ్ గురించి మాట్లాడుతూ.. ప్రిపరేషన్ ఎల్లప్పుడూ ముఖ్యం. ఆటకు ముందు మిమ్మల్ని మీరు ఉత్సాహంగా ఉంచుకోవాలి. మీరు ఎల్లప్పుడూ యార్కర్లు వేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు యార్కర్లు, షార్ట్ బాల్స్ వేయాలి. కొన్నిసార్లు నెమ్మది బంతులు వేయడం కూడా ముఖ్యమని బుమ్రా పేర్కొన్నారు. కాగా.. గురువారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే…..
