భాగ్యనగరంలో జరుగుతున్న సదర్ ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. రోడ్డు మీదకు వచ్చిన దున్నపోతు బీభత్సం సృష్టించింది. కనిపించిన వారిని కనిపించినట్టు కుమ్మేసింది. ఖైరతాబాద్ చింతల్‌బస్తీలో ఈ సంఘటన జరిగింది. దాన్ని కట్టడి చేయడానికి ప్రయత్నించినప్పటికీ వీలు కాలేదు.
జనంపై దూసుకెళ్లిన దున్నపోతు… స్కూటీతో పాటు మహిళను ఈడ్చుకెళ్లింది. దున్నపోతు దాడిలో నలుగురికి గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. చివరికి కొందరు యువకులు ఖైరతాబాద్ చౌరస్తాలో దున్నపోతును పట్టుకున్నారు. కాగా.. హైదరాబాద్ మహా నగరం లో సదర్ పండుగ ఉత్సవాలు చాలా అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇక ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు కూడా హాజరయ్యారు.