Samsung Galaxy A06 Price and Specifications: దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ‘శాంసంగ్’.. భారతదేశంలో మరో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఆసియా మార్కెట్లలో లాంచ్ చేసిన కొద్ది రోజుల తర్వాత.. ‘శాంసంగ్ గెలాక్సీ ఏ06’ను మార్కెట్‌ల్లోకి తీసుకొచ్చింది. సూపర్ ఫీచర్స్, ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తున్న ఈ ఫోన్.. బడ్జెట్ ధరలో లాంచ్ అయింది. 50ఎంపీ కెమెరా, 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ గల గెలాక్సీ ఏ06 ఫోన్ 10 వేలకే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పూర్తి డీటెయిల్స్ ఓసారి చూద్దాం.
శాంసంగ్ గెలాక్సీ ఏ06 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,999గా ఉండగా.. 4జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ.11,499గా ఉంది. బ్లాక్, గోల్డ్, లైట్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. గెలాక్సీ ఏ06 ఫోన్ శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయొచ్చు. అయితే ఈ ఫోన్ 4జీ నెట్‌వర్క్‌కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది.
Also Read: Pakistan Cricket: పాకిస్థాన్‌కు మరో షాక్.. అక్కడ కూడా 8వ స్థానమే!
గెలాక్సీ ఏ06 ఫోన్‌లో 6.7 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ పీఎల్‌ఎస్ ఎల్‌ఈడీ స్క్రీన్‌తో వస్తోంది. ఇందులో ఆక్టాకోర్ మీడియా టెక్ హీలియో జీ85 ప్రాసెసర్ ఉండగా.. ఆండ్రాయిడ్ 14 ఆధారిత వన్ యూఐ6తో పని చేస్తుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ సాయంతో 1టీబీ వరకు స్టోరేజీ పెంచుకోవచ్చు. ఫోన్ వెనకాల 50 ఎంపీ రియల్ కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సర్ ఉంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8 ఎంపీ కెమెరా ఇచ్చారు. 4జీ, వైఫై, బ్లూటూత్ 5.3, 3.5 ఎంఎం ఆడియోజాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ ఇందులో ఉన్నాయి.