ICC Test Rankings-Pakistan: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు మరో షాక్ తగిలింది. బంగ్లాదేశ్ చేతిలో టెస్టు సిరీస్‌ను కోల్పోయి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పట్టికలో ఎనిమిదో స్థానానికి పడిపోయిన పాక్.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ల్లోనూ కిందకు పడిపోయింది. తాజాగా విడుదల చేసిన ఐసీసీ మెన్స్ టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలను కోల్పోయిన పాక్ 8వ స్థానానికి పడిపోయింది. బంగ్లాతో టెస్టు సిరీస్‌కు ముందు పాకిస్తాన్ ఆరో స్థానంలో ఉంది. ఛాంపియన్‌షిప్ పట్టిక, టెస్ట్ ర్యాంకింగ్స్‌లో సైతం 8వ స్థానంలో ఉండడం విశేషం.
బంగ్లాదేశ్ చేతిలో వరుసగా రెండు మ్యాచుల్లోనూ ఓటమి కారణంగా పాకిస్తాన్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలను కోల్పోయింది. ప్రస్తుతం పాక్ ఖాతాలో 76 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ జాబితాలో ఆస్ట్రేలియా (124 పాయింట్లు) అగ్రస్థానంలో ఉంది. భారత్ (120), ఇంగ్లండ్ (108), సౌతాఫ్రికా (104), న్యూజీలాండ్ (96) టాప్ 5లో ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో కూడా పాక్ ప్లేయర్స్ హవా లేదు. బ్యాటర్ బాబర్ ఆజామ్ 9 స్థానంలో, పేసర్ షాహిన్ ఆఫ్రిది 10వ స్థానంలో ఉన్నాడు.
Also Read: Rahul Gandhi: రాహుల్ గాంధీని కలిసిన రెజ్లర్లు వినేశ్, బజ్‌రంగ్.. రాజకీయ అరంగేట్రం ఖాయమే?
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025 లిస్ట్‌లో భారత్ (68.52 శాతం), ఆస్ట్రేలియా (62.50 శాతం) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. న్యూజిలాండ్ (50) మూడులో ఉండగా.. పాక్‌పై టెస్టు సిరీస్ గెలిచిన బంగ్లాదేశ్ (45.83) నాలుగో స్థానానికి చేరుకుంది. పాకిస్థాన్ (19.05) ఎనిమిదో స్థానంలో ఉంది.