Poco M6 Plus 5g Price: పోకో నుంచి సూపర్ స్మార్ట్‌ఫోన్.. తక్కువ బడ్జెట్‌లో సూపర్ కెమెరా, భారీ బ్యాటరీ!
- పోకో నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ 5G స్మార్ట్‌ఫోన్
- ఆగష్టు 1న భారత మార్కెట్‌లో రిలీజ్
- 5030 ఎంఏహెచ్ బ్యాటరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Poco M6 Plus Launch Date and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘షావోమీ’ సబ్‌బ్రాండ్ ‘పోకో’ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అవుతోంది. ‘పోకో ఎం6 ప్లస్’ పేరుతో కంపెనీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఆగష్టు 1న భారత మార్కెట్‌లో ఎం6 ప్లస్ రిలీజ్ కానుంది. ఈ ఫోన్ అమ్మకాలు ఈ కామర్స్ సైట్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో అందుబాటులో ఉండనున్నాయి. శక్తిమంతమైన ఫీచర్లతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.15 వేల లోపే అని తెలుస్తోంది.
నివేదికల ప్రకారం.. పోకో ఎం6 ప్లస్ ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 ఇంచెస్ ఐపీఎస్ ఎల్‌సీడీ ఫుల్‌హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. 1080×2460 పిక్సెల్స్ రిజొల్యూషన్, 850 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్ సొంతం. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 అడ్వాన్స్‌డ్ ఎడిషన్ విత్ 2.2 గిగా హెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 హైపర్ ఓఎస్ కస్టమ్ యూఐ వర్షన్ ఇందులో ఉండనుంది. బెటర్ గేమింగ్, మల్టీ మీడియా ఎక్స్ పీరియన్స్ కోసం అడ్రెనో జీపీయూతో గ్రాఫిక్స్ కార్డు ఉంటుంది.
Also Read
- Hyderabad: అమీర్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు
- AI in Media: ఏఐ ప్రపంచాన్నే మార్చేస్తోంది.. కానీ జర్నలిజాన్ని భర్తీ చేయగలదా?
- Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
- Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
Also Read: Gold Rate Today: మళ్లీ షాకిస్తున్న బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?
పోకో ఎం6 ప్లస్ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఎఫ్/1.75 ఎపర్చర్‌తో ఉంటుంది. 3x ఇన్-సెన్సార్ జూమ్‌కు మద్దతు ఇస్తుంది. రింగ్ ఎల్‌ఈడీ ఫ్లాష్ లైట్ కూడా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5030 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. భారతదేశంలో ఎం6 ప్లస్ ధర రూ.13,000 నుండి రూ.15,000 వరకు ఉండవచ్చు. ఆగష్టు 1న పూర్తి డీటెయిల్స్ తెలియరానున్నాయి. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ 5G ఫోన్ అని చెప్పాలి.
తాజావార్తలు
-
Crime Thriller OTT : నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే… ఓటీటీలోకి గూస్ బంప్స్ తెప్పించే కన్నడ క్రైమ్ థ్రిల్లర్
-
Hyderabad: అమీర్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు
-
Maruti WagonR Flex Fuel: దేశపు తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు మారుతి వాగన్ఆర్ ఆవిష్కరణ.. పెట్రోల్ ఖర్చు, కాలుష్యానికి చెక్!
-
AI in Media: ఏఐ ప్రపంచాన్నే మార్చేస్తోంది.. కానీ జర్నలిజాన్ని భర్తీ చేయగలదా?
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
ట్రెండింగ్
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!