Buddy Trailer : టాలీవుడ్ హీరోలలో ఒకరైన అల్లు శిరీష్ (Allu Sirish) తాజాగా నటిస్తున్న చిత్రం ‘బడ్డీ’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేస్తుంది. ఇప్పటి విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్ భారీ అంచనాలను క్రియేట్ చేసింది. టెడ్డీ సినిమాను సామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూర్తిగా యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్నట్లుగా ట్రైలర్ చూస్తే యిట్టె అర్థమవుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ‘బడ్డీ’ సినిమా ట్రైలర్ మొత్తం యాక్షన్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటుంది.
CM Chandrababu: చంద్రబాబు భావోద్వేగం.. మళ్లీ జన్మ ఉంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతా..
ట్రైలర్ అన్యాయం పై తిరగబడ్డ ఒక టెడ్డీ బేర్ అంటూ ఈ ట్రైలర్ మొదలవుతుంది. ఇందులో ఓ టెడ్డీ బేర్ విలన్లను కొట్టడం కనిపించింది. ఇక ఈ టెడ్డీ బేర్ కు సాయం చేసే కెప్టెన్ పాత్రలో హీరో అల్లు శిరీష్ కనిపిస్తాడు. చాలా రోజుల తర్వాత ” అజ్మల్ ” విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో యాక్షన్ మోతాదును డైరెక్టర్ దీన్ని తెరకెక్కించారు. ఇక ఈ సినిమాకు హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే సినిమా సాంగ్స్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఈ మూవీలో ప్రిషా రాజేష్ సింగ్, ముఖేష్ కుమార్, అలీ మొదలగు తారాగణం ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు.
Prabhas : ప్రభాస్ కు ఇంకా ఆ గాయం తగ్గలేదా.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..