ఏపీలో కృష్ణా జిల్లాకు చెందిన అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం రసకందాయంలో పడింది. టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న (buddha venkanna) వైసీపీ నేతల్ని టార్గెట్ చేశారు. టీడీపీపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఇప్పటికే హెచ్చరించిన బుద్దా వెంకన్న మాజీ మంత్రి కొడాలి నానిపై విరుచుకుపడ్డారు. చంద్రబాబుపై విమర్శలు మానుకోకపోతే నానిని పోస్టుమార్టం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. హరికృష్ణ (Harikrishna Nandamuri), వైఎస్సార్ (YSR)లలో ఎవరు గొప్ప అంటే నాని ఏమి సమాధానం ఇస్తాడు..?వైఎస్ చనిపోయినప్పుడు కొడాలి నాని ఏం చేశారో త్వరలో బయట పెడతానన్నారు బుద్దా వెంకన్న.
Read Also: Do not do this at night: హెచ్చరిక.. రాత్రిళ్లు ఇలా చేయవద్దు
చనిపోయిన హరికృష్ణ పేరు వాడుకుని నాని బతుకుతున్నాడు. ఆనాడు హరికృష్ణ ఎన్నికల్లో ఓడిపోవడానికి నానినే కారణం. కొడాలి నాని కుక్కతోలు కప్పుకున్న గుంట నక్క. కొడాలి నాని ఒక శకుని. కొడాలి నాని బతుకు మైండ్ గేమ్ బతుకు. కొడాలి నాని ఏ పార్టీలో ఉన్నా.. ఆ పార్టీకి కీడు తప్ప మేలు జరగదన్నారు. బీసీ వర్గానికి చెందిన నన్ను నాని ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. నన్ను, నా కులాన్ని విమర్శిస్తే కట్టెల్లో నానిని కాల్చేస్తాం అని హెచ్చరించారు బుద్ధా వెంకన్న.