వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న, విజయసాయి రెడ్డిని చూసి బురదలో పందులు కూడా సిగ్గుపడుతున్నాయి.చంద్రబాబు, లోకేష్ లపై ట్వీట్లు పెట్టడం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఏనాడన్నా విజయసాయి పట్టించుకున్నారా? కుక్కకి పిచ్చి ముదిరితే రాళ్లతో కొట్టే పరిస్థితిని విజయ సాయి తెచ్చుకోవద్దు.
Banjara Hills: దారుణం.. యువతిని బంధించి సెక్యూరిటీ గార్డ్ అత్యాచారం
ప్రజలు వైసీపీకి ఎందుకు ఓటేయరో చర్చించేందుకు నేను సిద్ధం, విజయసాయి సిద్ధమా? ఇవాళ ఎన్నికలు జరిగితే వైసీపీకి ఉన్న 151 స్థానాల్లో చివరి ఒకటి పోవటం ఖాయం. పాపాత్ములకు కూడా అప్పుడప్పుడు మంచి రోజులోస్తాయనటానికి విజయసాయి ఓ ఉదాహరణ. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో పై విజయసాయి ట్వీట్లు పెట్టలేడా..? వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ఎన్టీఆరుకు బసవతారకమే ఎన్ని జన్మలకైనా భార్య. లక్ష్మీ పార్వతి ఎన్టీఆరుకి పట్టిన చీడ. కేశినేని నాని గురించి మాట్లాడే స్థాయి నాది కాదు, మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మాకు చంద్రబాబే ఏకైక నాయకుడు, ఆయన మాటే శిరోధార్యం. విజయవాడ టీడీపీలో నేతల మధ్య విభేదాలు లేవు. కేశినేని నాని ఒక ఎంపీ…ఆయన గురించి మాట్లాడే స్థాయి నాది కాదు. టీడీపీకి చంద్రబాబు ఒక్కడే నాయకుడు.. మేమంతా చంద్రబాబు అనుచరులు మాత్రమే. టీడీపీని పుట్టించింది ఎన్టీఆర్.. బతికించింది చంద్రబాబు.