BSNL: వినియోగదారులకు షాక్.. సూపర్ హిట్ ప్లాన్స్‌ను తర్వలో నిలిపేయనున్న బిఎస్ఎన్ఎల్
- బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు షాక్.
- మూడు సూపర్ హిట్ ప్లాన్స్‌ను తర్వలో నిలిపేయనున్న బిఎస్ఎన్ఎల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSNL: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన కోట్లాది మంది కస్టమర్లకు షాక్ ఇవ్వబోతోంది. బిఎస్ఎన్ఎల్ తన కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లను మూసివేయబోతోంది. బిఎస్ఎన్ఎల్ లో సూపర్‌హిట్‌గా నిలిచిన రూ. 201, రూ. 797, రూ. 2,999 ప్లాన్లు ఫిబ్రవరి 10 నుండి అందుబాటులో ఉండవు. కాబట్టి, ఈ ప్లాన్‌ల ప్రయోజనాలను పొందాలనుకుంటే వినియోగదారులు ఫిబ్రవరి 10 లోపు రీచార్జ్ చేసుకోవాలి. ఈ ప్లాన్‌ల స్పెషాలిటీ ఏమిటో వివరంగా తెలుసుకుందాం.
Also Read: Brown Sugar: షుగర్ వ్యాధిగ్రస్తులు తీపికోసం ప్రత్యాయంగా వీటిని వాడితే సరి!
Also Read
BSNL రూ. 201 ప్లాన్ వాలిడిటీ 90 రోజులు. రూ.201 ప్లాన్‌లో 300 నిమిషాల కాలింగ్, 6GB డేటా అందుబాటులో ఉంటుంది. ఇది తప్ప, ఈ ప్లాన్‌లో ఇతర ప్రయోజనం లేదు. సిమ్‌ను ఎక్కువ కాలం యాక్టివ్‌గా ఉంచడానికి ఇది బిఎస్ఎన్ఎల్ ఉత్తమ ప్లాన్.
BSNL రూ.797 ప్లాన్ 300 రోజులు. అంటే మీ మొబైల్ 300 రోజుల పాటు యాక్టివ్‌గా ఉంటుంది. BSNL యొక్క రూ. 797 ప్లాన్‌లో, అన్ని ప్రయోజనాలు 60 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. 60 రోజుల్లో అపరిమిత కాలింగ్, రోజుకు 2GB డేటా, 100 SMS ఉచితంగా లభిస్తాయి. ఆ తర్వాత ఈ ప్రయోజనాలన్నీ అందుబాటులో లేవు. సిమ్ మాత్రమే యాక్టివ్‌గా ఉంటుంది.
BSNL రూ. 2,999 ప్లాన్ ఒక పూర్తి సంవత్సరం చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ కింద ప్రతిరోజూ 3BG డేటా అందుబాటులో ఉంది. దీనితో పాటు, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMS ల ప్రయోజనం అందుబాటులో ఉంది. డేటా, కాలింగ్ అవసరమయ్యే వినియోగదారులకు ఈ ప్లాన్ ఉత్తమమైనది. ప్రతి నెలా రీచార్జ్ చేసుకోకుండా ఏకంగా ఏడాది మొత్తం రీఛార్జ్ చేసుకోవాలనేవారికి ఇది ఎంతగానో మేలు చేకూరుతుంది.
Also Read: SamyukthaMenon : చూడ చక్కని ‘సంయుక్త మీనన్’ మనసు దోచెన్
ఇకపోతే, BSNL వినియోగదారులు ఈ ప్లాన్‌ల ప్రయోజనాలను పొందాలనుకుంటే ఫిబ్రవరి 10 లోపు రీచార్జ్ చేసుకోవాలి. ఈ తేదీ తర్వాత ఈ ప్లాన్‌లు అందుబాటులో ఉండవు. ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే, ప్లాన్ కాలపరిమితి వరకూ మీరు దీని ప్రయోజనాలను పొందవచ్చు. కాబట్టి BSNL వినియోగదారులు త్వరగా నిర్ణయం తీసుకుని తమకు అవసరమైన ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవడం మంచిది. BSNL నుంచి మరిన్ని అప్‌డేట్‌లు రావడానికి వేచిచూడాలి.
తాజావార్తలు
-
IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
-
Venkatesh Maha: రంగస్థలం నేను రాసిన కథ: డైరెక్టర్ వెంకటేష్ మహా
-
Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
-
Pawan Kalyan: రేపు హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
-
Netanyahu-Iran: ఇరాన్‌కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి దాడి చేస్తే మాత్రం..!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!