NTV Telugu Site icon

BSF: పాకిస్థాన్ ‘డ్రోన్’ కుట్ర.. 6 నెలల్లో 126 డ్రోన్లు కూల్చేసిన బీఎస్ఎఫ్‌

Indian Bsf

Indian Bsf

భారత్‌పై పాకిస్థాన్ కుట్రలు కొనసాగిస్తోంది. ఒకవైపు సరిహద్దుల నుంచి ఉగ్రవాదులను పంపిస్తూనే మరోవైపు డ్రోన్ల ద్వారా డ్రగ్స్, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నకిలీ కరెన్సీని సరిహద్దు ప్రాంతాలకు పంపిస్తోంది. కానీ సరిహద్దులో మోహరించిన బీఎస్ఎఫ్ సైనికులు నిరంతరం దుర్మార్గపు కుట్రలను భగ్నం చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జులై 9 మధ్య పంజాబ్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్‌ 126 డ్రోన్‌లను కూల్చివేసింది. అయితే 2023లో ఈ డ్రోన్లు/యూఏవీల సంఖ్య 107గా ఉంది.

READ MORE: NEET-UG paper leak: నీట్-యూజీ పేపర్ లీకులో మరో సూత్రధారి అరెస్ట్..

బీఎస్ఎఫ్‌ “ఎక్స్” లో ఈ వివరాలను పంచుకుంది. ఇది అసాధారణ ప్రదర్శనగా అభివర్ణిస్తూ.. దేశ భద్రతలో బీఎస్ఎఫ్ పంజాబ్ అంకితభావంతో మరియు సమర్ధవంతంగా పనిచేస్తుందని రాసుకొచ్చింది. డ్రోన్ల ద్వారా పంజాబ్ సరిహద్దు ప్రాంతాలకు డ్రగ్స్, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నకిలీ కరెన్సీలను పాకిస్థాన్ పంపుతుంది. దీని ద్వారా భారత్‌లో డ్రగ్స్ వ్యాపారం, ఉగ్రవాదాన్ని పెంచాలని భావిస్తోంది. అంతేకాకుండా డ్రోన్ల ద్వారా సరిహద్దుల్లో గూఢచర్యం చేసేందుకు కూడా పాక్ యత్నిస్తోంది. ఈ ఏడాది 126 డ్రోన్లతో పాటు 150 కిలోల హెరాయిన్, 18 ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ తన పోస్ట్‌లో పేర్కొంది. ఇది కాకుండా, ఒక పాకిస్థానీ చొరబాటుదారుని హతమార్చింది. అంతర్జాతీయ సరిహద్దును దాటడానికి ప్రయత్నిస్తున్న 21 మందిని అరెస్టు చేసింది.

READ MORE: OLA: మహిళతో ఓలా ఆటో డ్రైవర్ దురుసు ప్రవర్తన..ఎక్స్ ఖాతాలో పంచుకున్న బాధితురాలు

పాకిస్థాన్ ఏయే ప్రాంతాలకు డ్రోన్లను పంపుతుంది?
పంజాబ్ గురించి మాట్లాడితే.. అంతర్జాతీయ సరిహద్దు జిల్లాల్లో పాకిస్థాన్ డ్రోన్లు తరచుగా కనిపిస్తాయి. వీటిలో ఫిరోజ్‌పూర్, గురుదాస్‌పూర్, తరన్ తరణ్, అమృత్‌సర్ మరియు పఠాన్‌కోట్ ఉన్నాయి. పాకిస్థానీ డ్రోన్లు ఈ ప్రాంతాలకు డ్రగ్స్ సరుకులను తీసుకువస్తాయి. అదే సమయంలో, పూంచ్, రాజౌరి మరియు సాంబాతో సహా జమ్మూ కాశ్మీర్‌లోని అనేక ప్రాంతాలలోడ్రోన్లు చొరబాటుకు ప్రయత్నిస్తున్నాయి.