విశాఖలో దంపతుల దారుణ హత్య కలకలం రేపింది. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. 24 గంటల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మృతులు రిటైర్డ్ నావెల్ డాక్ యార్డ్ ఉద్యోగి గంపల యోగేంద్ర బాబు (66), భార్య లక్ష్మి (52)గా పోలీసులు గుర్తించారు. గుర్తు తెలియని దుండగులు హత్య చేసి ఇంటికి తాళాలు వేసి పారిపోయారు. యోగేంద్ర బాబు మేనల్లుడు.. ఇంటికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో దంపతులు పడి ఉన్నారు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్నారు.
READ MORE: YS Jagan Helicopter Incident: జగన్ పర్యటనలో హెలికాప్టర్ ఘటనపై విచారణ వేగవంతం..
తాళాలు పగలగొట్టి లోపల చూడగా హాల్లో భర్త, రూములో భార్య రక్తపు మడుగులో పడి ఉన్నారు.. ఎవరు హత్య చేశారు? ఎందుకు హత్య చేశారు? అనేదానిపై దర్యాప్తు చేపడుతున్నారు. పోలీసులు ఆధారాలకోసం ప్రయత్నిస్తున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. ఇంటి చుట్టూ పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. హత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గురువారం సాయంత్రం 7.30 గంటల సమయంలో గట్టిగా అరుపులు వినిపించాయని.. అయితే అవి భార్యాభర్తల గొడవలుగా భావించి వెళ్లలేదని స్థానికులు తెలిపారు. గురువారం అందరూ గ్రామదేవత పండగ హడావుడిలో ఉండగా ఆ సమయంలో ఇంట్లోకి ప్రవేశించి దుండగులు హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కాగా.. వారు అమెరికాలో ఉన్నారు.
READ MORE: Virginia Giuffre: ప్రిన్స్ ఆండ్రూపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన గియుఫ్రే ఆత్మహత్య