విశాఖలో దంపతుల దారుణ హత్య కలకలం రేపింది. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. 24 గంటల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మృతులు రిటైర్డ్ నావెల్ డాక్ యార్డ్ ఉద్యోగి గంపల యోగేంద్ర బాబు (66), భార్య లక్ష్మి (52)గా పోలీసులు గుర్తించారు. గుర్తు తెలియని దుండగులు హత్య చేసి ఇంటికి తాళాలు వేసి పారిపోయారు. యోగేంద్ర బాబు మేనల్లుడు.. ఇంటికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో దంపతులు…