Tirupati Crime: ఆడవాళ్లు ఇంటి నుంచి బయటకు వస్తే.. మళ్లీ సేఫ్‌గా ఇంటికి తిరిగి వస్తారా? అంటే కొన్ని ఘటనలు మాత్రం దానికి సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నాయి.. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసు.. ఇంకా ఎక్కడైనా వారు వేధింపులకు గురి అవుతోన్న ఘటనలు ఎన్నో ఉన్నాయి.. ఒక, రోడ్లపై ఎక్కడికక్కడ వారి వెంటపడి వేధించేవారి లేకపోలేదు.. వారి భయంతో.. బయటకు రావాలంటేనే వణికిపోయేవారు కూడా ఉన్నారు.. అయితే, తనకు తెలిసిన యువతిని వేధిస్తున్న పోకిరీలకు వార్నింగ్ ఇచ్చినందుకు ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటనలో తిరుపతిలో కలకలం రేపుతోంది.
తిరుపతిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుపతిలోని సుబ్బారెడ్డి నగర్‌లో కిషోర్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.. ఈ హత్య ఎందుకు? జరిగింది? ఎవరి పని కావొచ్చు అనేదానిపై పోలీసుల చెబుతున్న వివరాల ప్రకారం.. తనకు పరిచయం ఉన్న యువతిన వేధిస్తున్న వారికి వార్నింగ్ ఇచ్చాడట కిషోర్.. మరోసారి ఆ యువతి జోలికి రావొద్దని హెచ్చరించాడట.. దీంతో, కిషోర్‌కు ఆ పోకిరీల మధ్య చిన్నపాటి వివాదం చోటు చేసుకుఒంది.. అది కాస్తా ఘర్షణకు దారితీసింది.. ఆ తర్వాత కత్తులతో కిషోర్‌పై దాడిచేసి చంపేశారు ముగ్గురు యువకులు.. సుబ్బారెడ్డి నగర్‌లోని కిషోర్ ఇంటి సమీపంలో ఈ ఘటన జరిగింది.. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.. హత్యచేసినా యువకుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.