తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు స్పందిస్తూ.. తమ ఓటమికి గల కారణాలను తెలుసుకుంటామన్నారు. ఈ ఎన్నికల ఫలితాలను ఒక పాఠంగా తీసుకుంటామని, తిరిగి మళ్లీ పుంజుకుంటాం బీఆర్ఎస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీమంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన.. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
Read Also: Pushpa Jagadeesh: బ్రేకింగ్.. యువతి ఆత్మహత్య.. అల్లు అర్జున్ ఫ్రెండ్ అరెస్ట్
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ మాత్రమే, ఇది స్వల్ప కాలం మాత్రమే అని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఎవరెన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టినా, కుట్రలు చేసినా ప్రజలు మాత్రం అభివృద్ధికి సంక్షేమానికే పట్టం కట్టారని తెలిపారు. ఎన్నికలలో అనుకోని ఫలితాలు రావడం సహజం, నిరాశ పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. పోరాటాల నుంచి వచ్చిన పార్టీ.. పోరాటాలు మాకేం కొత్తకాదని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల పక్షాన ప్రజలు గొంతుకై మాట్లాడుతామని అన్నారు.
Read Also: Floods: ఒక్క చెన్నై మాత్రమే కాదు.. శతాబ్దం చివరి నాటికి వరద ప్రమాదంలో 12 నగరాలు..
అయ్యో కేసీఆర్ ప్రభుత్వం పోయిందా? అంటూ కాంగ్రెస్ కు ఓటువేసిన వారు కూడా మెసేజ్ లు పెడుతున్నారని కేటీఆర్ చెప్పారు. పవర్ పాలిటిక్స్ లో అధికారం రావడం పోవడం సహజం, నిరాశ పడాల్సిన అవసరంలేదని తెలిపారు. ప్రజలు మనకు కూడా రెండు సార్లు అవకాశం ఇచ్చారు, దానికి భయపడాల్సిన అవసరంలేదని అన్నారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రలో కూడా రానిస్తాం, ప్రజల గొంతుకై మాట్లాడుతామని పేర్కొన్నారు. తెలంగాణకు ఉన్న ఏకైక గొంతు కేసీఆర్, బీఆర్ఎస్.. ప్రజలు వదులుకోరని కేటీఆర్ చెప్పారు. కాగా.. సిరిసిల్లలో ఓటుకు డబ్బులు, మందు పంచనని మాట ఇచ్చాను.. ఆ మాటను నిలబెట్టుకున్నాను.. ప్రజలు కూడా నా విశ్వాసాన్ని నిలబెట్టారని కేటీఆర్ తెలిపారు.