NTV Telugu Site icon

T. Padma Rao Goud: ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న పద్మారావు గౌడ్..

Padma Rao

Padma Rao

సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి అంబర్ పేట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్తో కలిసి అంబర్ పేట్ డివిజన్లోని న్యూ పటేల్ నగర్, నరేంద్ర నగర్, చెన్నారెడ్డి నగర్, సి బ్లాక్, రఘునాథ్ నగర్ కాలనీలలో పద్మారావు గౌడ్ పాదయాత్ర నిర్వహించారు.

Read Also: V Srinivasa Rao: ఏపీలో ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో అభివృద్ధి జాడ ఎక్కడ?

పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా.. అంబర్ పేట్ నియోజకవర్గంలోని పలు కాలనీలలో ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని పద్మారావు గౌడ్ ఓటర్లను అభ్యర్థించారు. గత ప్రభుత్వ హయాంలో పదేళ్లలో చేసిన అభివృద్ధి, తీసుకొచ్చిన సంక్షేమ పథకాల గురించి ఓటర్లకు ఆయన వివరించారు. అంబర్ పేట్లో కేంద్రమంత్రిగా ఉండి, తాను తీసుకొచ్చిన ఫ్లై ఓవర్ ఎందుకు పూర్తి చేయలేకపోయారని అంబర్ పేట్ ప్రజానీకం కిషన్ రెడ్డిని ప్రశ్నించాలని పద్మారావు గౌడ్ తెలిపారు.

Read Also: Mallikharjuna Kharge: పేదల హక్కులను హరించేందుకు చూస్తోంది.. బీజేపీపై తీవ్ర విమర్శలు

మాజీ మంత్రి కేటీఆర్ గడిచిన పదేళ్లలో హైదరాబాద్ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ను గెలిపించారో.. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలలో కూడా అంతే ఉత్సాహంతో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఓటర్లకు ఎంపి అభ్యర్థి పద్మారావు గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దాసోజు శ్రావణ్, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.