Site icon NTV Telugu

MLC Kavitha: ప్రాణాలకు తెగించి కేసీఆర్‌ దీక్షకు బయలుదేరిన రోజు ఇది..

Mlckavitha

Mlckavitha

MLC Kavitha: ఈ రోజు బీఆర్‌ఎస్‌కు ఎంతో గుర్తు పెట్టుకునే రోజు అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రాణాలకు తెగించి కేసీఆర్ దీక్షకు బయలుదేరారన్నారు. 15 సంవత్సరాల క్రితం కేసీఆర్ మా మాట కూడా వినకుండా.. తెలంగాణ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి ముందుకు వెళ్లారన్నారు. అందుకే బీఆర్‌ఎస్‌ పార్టీ దీక్షా దివస్‌ను ఓ పండుగలా జరుపుకుంటుందన్నారు. లగచర్ల విషయంలో ప్రభుత్వం వెనక్కు వెళ్లడం ప్రజా విజయమన్నారు. ప్రజలు కలిసి పోరాడితే విజయం ఇలాగే ఉంటుందన్నారు. ఇకపై బీఆర్‌ఎస్ పార్టీ కార్యక్రమాలు పెంచుతామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మా పోరాటం కొనసాగుతోందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్‌లు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నాయన్నారు. రెండు పార్టీలను ప్రజా కోర్టులో నిలబెడుతామన్నారు.

Read Also: Adibatla : వస్త్ర వ్యాపారి కిడ్నాప్ కలకలం.. లేడీ వాయిస్‌తో ట్రాప్..!

Exit mobile version