Site icon NTV Telugu

MLC Kavitha: కవితకు నిరాశ.. బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

K. Kavitha

K. Kavitha

MLC Kavitha: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో సారి నిరాశ ఎదురైంది. ఢిల్లీ లిక్కర్‌ స్కాంకు సంబంధించి సీబీఐ అరెస్టుపై క‌విత వేసిన బెయిల్ పిటిష‌న్‌పై తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును మే 2కు రిజర్వ్ చేసింది. ఈడీ అరెస్టులో ఆమె దాఖ‌లు చేసిన బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ కొన‌సాగుతోంది. సీబీఐ కేసులో తీర్పును రిజ‌ర్వ్ చేసిన న్యాయ‌స్థానం.. ఈడీ కేసులో ఎలాంటి తీర్పు ఇస్తుందోన‌ని ఉత్కంఠ నెల‌కొంది. కాగా, ఢిల్లీ మద్యం కుంభ‌కోణం కేసులో క‌విత‌ను ఈడీ మార్చి 15న అదుపులోకి తీసుకోగా, సీబీఐ ఏప్రిల్ 11న‌ అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఆమె రెండు బెయిల్ పిట‌ష‌న్లు వేశారు. ప్రస్తుతం ఆమె 14 రోజుల జ్యుడిషియ‌ల్ క‌స్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు.

Read Also: CM Revanth Reddy: ఆదిలాబాద్‌కు సీఎం రేవంత్ రెడ్డి వరాలు..

సీబీఐ లిక్కర్ కేసులో కవిత బెయిల్‌ పిటిషన్‌పై ఆమె తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. మహిళగా కవిత బెయిల్‌కు అర్హురాలు. అరెస్ట్ నుంచి విచారణ వరకు ఎటువంటి మెటీరియల్ లేదు. ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారు. ఈడీ కస్టడీలో ఉన్నా.. సీబీఐ ఎందుకు అరెస్ట్ చేసింది. అరెస్ట్ చెయ్యాల్సిన అవసరం లేదు. పార్టీకి స్టార్ క్యాంపైనర్. ప్రతిపక్షంలో ఉన్నాం.. రూలింగ్ లో ఉన్నపుడే, ఏం చెయ్యలేక పోయాం. చిదంబరం జడ్జిమెంట్ కవిత విషయంలో సరిపోతుంది. ఏడేళ్ల లోపల పడే శిక్ష ఆధారాలకు అరెస్ట్ అవసరం లేదు. అరెస్ట్‌కు సరైన కారణాలు లేవు.” కవిత తరపున వాదనలు వినిపించారు. అనంతరం సీబీఐ తరపున వాదనలు జరిగాయి. “కవితకు బెయిల్ ఇవ్వొద్దు. కవిత ప్రభావితం చేయగలుగుతారు. కవిత లిక్కర్ కేసులో కీలక వ్యక్తిగా ఉన్నారు” అని సీబీఐ వాదనలు వినిపించింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును మే 2కు రిజర్వ్ చేసింది.

Exit mobile version