Harish Rao: మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై విరుచుకపడ్డారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ నుండి గత మూడు నెలలుగా ఆంధ్రప్రదేశ్‌కు కుడి కాలువ ద్వారా 10,000 క్యూసెక్కుల నీరు తరలించబడుతోంది. రోజూ సుమారు రెండు టీఎంసీల నీరు ఏపీకి చేరుతోంది. ఈ తరలింపును ఆపేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సాగర్ నీటిని ఏపీ తరలించడంపై అసెంబ్లీలో తీవ్ర చర్చ జరిగినప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి స్పష్టమైన విజ్ఞప్తి చేసేందుకు వెనుకడుగేస్తోందని విమర్శలు వస్తున్నాయి.
Read Also: Bhupalpally: లింగమూర్తి హత్యపై ప్రభుత్వం సీరియస్.. అనేక కోణాల్లో పోలీసుల దర్యాప్తు
అసెంబ్లీలో నాగార్జున సాగర్ వద్ద మోహరించిన CRPF బలగాలను వెనక్కి తీసుకోవాలని తీర్మానం చేసినప్పటికీ, వాటిని రద్దు చేయాలని కేంద్రాన్ని కోరే ధైర్యం తెలంగాణ ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. అంతేకాకుండా, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కూడా ఈ అంశంపై మాట్లాడే ధైర్యం లేదని అన్నారు. మా మీద ఎగరాలంటే జానెడు జానెడు ముఖ్యమంత్రి ఎగురుతారని ఎద్దేవా చేసారు. ఇకనైనా మొద్దు నిద్ర వీడి రాష్ట్రములోని లక్షల ఎకరాల్లో ఉన్న భూములకు నీళ్లు అందేలా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు.