యాదాద్రి జిల్లా భువనగిరి నియోజకవర్గ విస్తృత సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఓటమి గెలుపుకు నాంది అని పేర్కొన్నారు. పాలకుల్లో అప్పుడే అసహనం కనిపిస్తోందని ఆరోపించారు. అధికారంలో ఉన్న వారికి అహంకారం ఎక్కువైందని తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఆ రోజు నల్గొండను ముంచి పులిచింతల ప్రాజెక్ట్ కట్టారని.. ఇప్పుడు కృష్ణాను కేఆర్ఎంబీకి అప్పగించారని హరీష్ రావు మండిపడ్డారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే కేఆర్ఎంబీ పై స్పందించాలని అన్నారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే తాగు, సాగునీటి కష్టాలు తప్పవని తెలిపారు.
Himanta Biswa Sarma: రాహుల్‌పై అసోం సీఎం కీలక వ్యాఖ్యలు
బీజేపీని నిలవరించే శక్తి బీఆర్ఎస్ పార్టీకీ మాత్రమే ఉంది.. బీజేపీ కీలక నేతలను ఓడించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీనే అని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఆమోదమే ఇందుకు నిదర్శనమని హరీష్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ లోనే అమలు చేస్తామని చెప్పిన సంక్షేమ పథకాలు ఎందుకు అమలు కాలేదని ప్రశ్నించారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలను చైతన్యం పరచాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి కోటపై బీఆర్ఎస్ జెండా ఎగరాలని అన్నారు. తాము కూడా రామభక్తులమేనని.. బీజేపీ పార్టీ విభజన హామీలు అమలను గాలికి వదిసేసిందని దుయ్యబట్టారు. తెలంగాణకు బీఆర్ఎస్ మాత్రమే శ్రీరామ రక్ష అని అన్నారు. కార్యకర్తలెవరు కేసులకు భయపడొద్దు.. భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీదేనని అన్నారు. క్యాడర్ కు అండగా నిలబడతామని హరీష్ రావు భరోసానిచ్చారు.
YSRCP 6th List: వైసీపీ ఆరో జాబితా విడుదల