సెక్రటేరియట్‌లో సీఎస్ శాంతికుమారితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సమావేశం అయ్యారు. అనంతరం సీఎస్‌కు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు అమలుపర్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని.. కుల గణనలో బీసీల సంఖ్యను తగ్గించి చూపించిన కుట్రను సరి చేయాలని సీఎస్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మధుసుదనా చారి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పాలనకు కొత్త భాష్యం చెప్తున్నారు.. పాలన అంటే భక్షించడం, శిక్షించడంలా చేస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి రావడమే లక్ష్యంగా అనేక హామీలిచ్చారని పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని సీఎస్‌ను కోరామని మధుసుదనా చారి తెలిపారు. ప్రభుత్వానికి బీసీలపై చిత్తశుద్ధి లేదు.. కులగణన రీ సర్వే జరపాలి, బీసీలకు ద్రోహం చేసే చర్యలను సహించమని పేర్కొన్నారు.
Read Also: Kishan Reddy: కాంగ్రెస్ డబుల్ హ్యాట్రిక్ జీరో సాధించింది..
మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. బీసీల పేరుతో బీసీలను కాంగ్రెస్ దగా చేసిందని మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ మర్చిపోయినా.. తాము మర్చిపోలేదన్నారు. సర్వే పూర్తి స్థాయిలో జరగలేదు.. మళ్ళీ రీ సర్వే చేయాలని తెలిపారు. బీసీలకు న్యాయం జరగాలంటే బీసీ డెడికేషన్ డే పేరుతో సర్వే చేయాలని డిమాండ్ చేశారు. బీసీలను తొక్కే కుట్ర జరుగుతుంది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తమిళనాడు తరహా కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేర్చాలి.. చట్ట బద్ధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని తెలిపారు. కేంద్రం కాళ్లు మొక్కి అయినా బీసీలకు 42 శాతం చట్టబద్ధంగా అమలు చేయాలని పేర్కొన్నారు.
Read Also: Libiya : లిబియాలో కుప్పలు కుప్పలుగా శవాలు.. వలసదారులవని అనుమానం