Rakesh Reddy : రేవంత్ రెడ్డి నాయకత్వంలో పాలన పడకేసింది అనుకున్నాం.. కానీ అటక్కేకింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేవంత్ రెడ్డి నాయకత్వంలో పాలన పడకేసింది అనుకున్నాం…కానీ అటకెక్కిందన్నారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వానికి పిఆర్ స్టంట్ మీద ఉన్న సోయి…ప్రజా సమస్యలు పరిష్కరించడంలో లేదని, ఆశా వర్కర్లు, అంగన్ వాడీలు, గురుకుల టీచర్లు, ఆందోళన చేస్తుంటే పట్టింపు లేదు. రాష్ట్రంలో హత్యలు, హత్యాచారాలు జరుగుతుంటే పట్టించుకోవడం లేదన్నారు రాకేష్ రెడ్డి. జీవో 46 బాధితులను పట్టించుకోవడం లేదని, 60 మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం వస్తె… 90 మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం రాలేదని ఆయన విమర్శించారు. వారికి న్యాయం చేస్తామని మాటిచ్చారు. కాంగ్రెస్ కోసం పనిచేయాలని అన్నారని, ఇప్పుడు ఎన్నికలు ఐపోగానే మొహం చాటేశారని రాకేష్ రెడ్డి మండిపడ్డారు.
అంతేకాకుండా..’ఇప్పుడు జీవో 46 బాధితులు కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు.. ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ పార్టీ కేటీఆర్, హరీష్ రావుని కలిశారు.. వారి పక్షాన మేము సిఎస్ ను కలవడానికి వచ్చాం.. 10 రోజులుగా చూస్తున్నాం. అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు.. ఈ ప్రభుత్వానికి చెప్పిన…గోడకు చెప్పిన ఒక్కటే అని వినతి పత్రం సెక్రటేరియట్ గోడకు అంటించి వచ్చాం జీవో 46 బాధితుల పక్షాన నిలుస్తున్నం. వారికి న్యాయం జరిగే వరకు మేము కొట్లడుతాం.. నేను ఎమ్మెల్సీగా ఓడిపోవచ్చు..ప్రజా క్షేత్రంలో ఉంటాం..చట్ట సభల్లో లెను…జన సభల్లో ఉంటా…బాధితులు పక్షాన నిలబడతా.. బీఆర్ఎస్ పార్టీ బాధితులకు అన్ని విధాల అండగా ఉంటుంది. వారి పక్షాన మేము పోరాటం చేస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వారిని ప్రజా భవన్ పిలుచుకొని, వారితో భోజనం చేసి వారి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం.. ప్రభుత్వాలు ఉద్యమాల వల్ల చట్టాలనే వెనక్కు తీసుకున్న సందర్బాలు ఉన్నాయి…ప్రజా పాలన అని చెబుతున్న రేవంత్ ప్రభుత్వం జీవో46 వెనక్కి తీసుకోవాలి..లేదా సవరణ చేయాలి.’ అని రాకేష్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read
- Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
- Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
- Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
- Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
తాజావార్తలు
-
Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
-
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?