KTR: చిన్నారుల ఆహ్వానం.. పాఠశాల వార్షికోత్సవానికి వెళ్లిన కేటీఆర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇచ్చిన మాటను మరోసారి నిలబెట్టుకున్నారు. చిన్నారులు సోషల్ మీడియాలో పంపిన ఆహ్వానానికి ఫిదా అయిన కేటీఆర్.. ఆదివారం పాఠశాల వార్షికోత్సవానికి వెళ్లి వారిని ఆనందపరిచారు. తనకు వీడియో ద్వారా ప్రత్యేకంగా ఆహ్వానం పంపిన చిన్నారులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. తనతో పాటు సోఫాలో కూర్చొబెట్టుకుని మరీ కాసేపు ముచట్లు చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కేటీఆర్‌తో సెల్ఫీలు తీసుకొని సంతోషం వ్యక్తం చేశారు.
రాజేంద్రనగర్‌లోని హైదరాబాద్ మిలీనియం పాఠశాల మూడో వార్షికోత్సవం ఆదివారం జరిగింది. నాలుగు రోజుల క్రితం ఈ పాఠశాలకు చెందిన కొందరు చిన్నారులు మాజీ మంత్రి కేటీఆర్‌ను తమ వార్షికోత్సవానికి హాజరుకావాలని కోరుతూ ఎక్స్‌లో ఓ క్యూట్ వీడియోను పోస్ట్ చేశారు. ‘హాలో కేటీఆర్ సర్.. మేము హైదరాబాద్ మిలీనియం స్కూల్ విద్యార్థులం. మార్చి 3న ఉడాన్ 3.0 పేరుతో నిర్వహించనున్న మా పాఠశాల మూడో వార్షికోత్సవాన్ని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఆదివారం హెరిటేజ్ ప్యాలెస్‌లో నిర్వహించనున్న ఈ వేడుకకు మీరు వస్తారని ఆశిస్తున్నాం. మీ రాక కోసం అందరం ఎదురుచూస్తుంటాం’ అని పిల్లలు ఓ వీడియో చేశారు.
Also Read
- Abhijeet Dipke: నా కొడుకు కష్టానికి ఫలితం దక్కింది.. అభిజిత్ దీప్కే తల్లి ఆనందం
- CJP: "ఇది ఫస్ట్ వికెట్ మాత్రమే".. సీజేపీ సంచలనం.. ప్రధాన్ రాజీనామాతో ఆగదా..?
- VVS Laxman: గౌతమ్ గంభీర్ విరామం.. భారత డ్రెస్సింగ్ రూమ్ స్వరూపాన్నే మార్చేసిన వివిఎస్ లక్ష్మణ్..
- Sharad Pawar: "మోడీ నా మాట విన్నారు".. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనక శరద్ పవార్..
Also Read: Telangana Congress: కాంగ్రెస్ వైపు.. కార్పొరేటర్ల మలుపు!
చిన్నారుల వీడియో చూసిన కేటీఆర్.. ఇంత క్యూటెస్ట్ ఇన్విటేషన్‌ను నేను ఇంతవరకు అందుకోలేదని రిప్లై ఇచ్చారు. ‘మీకోసం కొంత సమయం తీసుకుని వస్తాను. మీ ఆహ్వానం అంత బాగా నచ్చింది. ఇప్పటిదాకా నాకు అనేక కార్యక్రమాలకు హాజరుకావాలని ఆహ్వానాలు అందాయి కానీ ఇంత క్యూటెస్ట్ ఆహ్వానం అందడం ఇదే మొదటిసారి’ అని రిప్లై ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రాజేంద్రనగర్ వెళ్లి మిలీనియం స్కూల్ విద్యార్థులతో కేటీఆర్ గడిపారు. ఈ కార్యక్రమానికి హాజరు కావడం పట్ల స్కూలు యాజమాన్యంతో పాటు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
తాజావార్తలు
-
Abhijeet Dipke: నా కొడుకు కష్టానికి ఫలితం దక్కింది.. అభిజిత్ దీప్కే తల్లి ఆనందం
-
CJP: “ఇది ఫస్ట్ వికెట్ మాత్రమే”.. సీజేపీ సంచలనం.. ప్రధాన్ రాజీనామాతో ఆగదా..?
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
VVS Laxman: గౌతమ్ గంభీర్ విరామం.. భారత డ్రెస్సింగ్ రూమ్ స్వరూపాన్నే మార్చేసిన వివిఎస్ లక్ష్మణ్..
-
Sharad Pawar: “మోడీ నా మాట విన్నారు”.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనక శరద్ పవార్..
ట్రెండింగ్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!