NTV Telugu Site icon

KTR: చిన్నారుల ఆహ్వానం.. పాఠశాల వార్షికోత్సవానికి వెళ్లిన కేటీఆర్‌!

Pawan Kalyan (2)

Pawan Kalyan (2)

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇచ్చిన మాటను మరోసారి నిలబెట్టుకున్నారు. చిన్నారులు సోషల్ మీడియాలో పంపిన ఆహ్వానానికి ఫిదా అయిన కేటీఆర్.. ఆదివారం పాఠశాల వార్షికోత్సవానికి వెళ్లి వారిని ఆనందపరిచారు. తనకు వీడియో ద్వారా ప్రత్యేకంగా ఆహ్వానం పంపిన చిన్నారులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. తనతో పాటు సోఫాలో కూర్చొబెట్టుకుని మరీ కాసేపు ముచట్లు చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కేటీఆర్‌తో సెల్ఫీలు తీసుకొని సంతోషం వ్యక్తం చేశారు.

రాజేంద్రనగర్‌లోని హైదరాబాద్‌ మిలీనియం పాఠశాల మూడో వార్షికోత్సవం ఆదివారం జరిగింది. నాలుగు రోజుల క్రితం ఈ పాఠశాలకు చెందిన కొందరు చిన్నారులు మాజీ మంత్రి కేటీఆర్‌ను తమ వార్షికోత్సవానికి హాజరుకావాలని కోరుతూ ఎక్స్‌లో ఓ క్యూట్ వీడియోను పోస్ట్‌ చేశారు. ‘హాలో కేటీఆర్ సర్.. మేము హైదరాబాద్ మిలీనియం స్కూల్ విద్యార్థులం. మార్చి 3న ఉడాన్ 3.0 పేరుతో నిర్వహించనున్న మా పాఠశాల మూడో వార్షికోత్సవాన్ని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఆదివారం హెరిటేజ్ ప్యాలెస్‌లో నిర్వహించనున్న ఈ వేడుకకు మీరు వస్తారని ఆశిస్తున్నాం. మీ రాక కోసం అందరం ఎదురుచూస్తుంటాం’ అని పిల్లలు ఓ వీడియో చేశారు.

Also Read: Telangana Congress: కాంగ్రెస్ వైపు.. కార్పొరేటర్ల మలుపు!

చిన్నారుల వీడియో చూసిన కేటీఆర్.. ఇంత క్యూటెస్ట్ ఇన్విటేషన్‌ను నేను ఇంతవరకు అందుకోలేదని రిప్లై ఇచ్చారు. ‘మీకోసం కొంత సమయం తీసుకుని వస్తాను. మీ ఆహ్వానం అంత బాగా నచ్చింది. ఇప్పటిదాకా నాకు అనేక కార్యక్రమాలకు హాజరుకావాలని ఆహ్వానాలు అందాయి కానీ ఇంత క్యూటెస్ట్ ఆహ్వానం అందడం ఇదే మొదటిసారి’ అని రిప్లై ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రాజేంద్రనగర్ వెళ్లి మిలీనియం స్కూల్ విద్యార్థులతో కేటీఆర్ గడిపారు. ఈ కార్యక్రమానికి హాజరు కావడం పట్ల స్కూలు యాజమాన్యంతో పాటు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

Show comments