NTV Telugu Site icon

Gandra Venkata Ramana: మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలకు గండ్ర కౌంటర్

Gandra Venkata Ramana

Gandra Venkata Ramana

Gandra Venkata Ramana: భూపాలపల్లి హత్య కేసుపై బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి స్పందించారు. నిన్న భూపాలపల్లిలో జరిగిన హత్యను తాము ఖండిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కేసును వివాదాస్పదం చేయాలని కొందరు ఉద్దేశ్యపూర్వకంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసు వెనుక భూవివాదమే ప్రధాన కారణమని అందరూ చెబుతున్నారని, హత్య చేసిన వారు కూడా అంగీకరించారని తెలిసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గండ్ర వెంకట రమణ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Read Also: Gold Smuggling: భారత్-బంగ్లా సరిహద్దులో భారీగా బంగారం పట్టివేత.. ఒకరు అరెస్ట్

మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాటలు చూస్తే బాధాకరంగా ఉందని, ఆయన మాటలు కేసుపై ప్రభావం చూపే విధంగా ఉన్నాయని అన్నారు. ఈ కేసుకు సంబంధించి అన్ని వివరాలు పోలీసుల వద్ద ఉన్నాయని.. కానీ కేసీఆర్, హరీష్ రావు, తనని అనవసరంగా ఆరోపిస్తున్నారని గండ్ర అన్నారు. అలాగే, మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డికి ఎవరినైనా నిర్ధారణ లేకుండా ఆరోపించడం అలవాటుగా మారిందని విమర్శించారు. హత్య కేసును అసలు విషయాన్నుంచి మళ్లించడానికి కుట్ర జరుగుతోందని.. మృతుడి భార్యతో ఇతర వ్యక్తులు కావాలని మాట్లాడిస్తున్నారని అన్నారు. మా మీద ఆధారంలేని ఆరోపణలు చేస్తున్నారని గండ్ర వెంకట రమణ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: Success Story: రియల్ ఎస్టేట్‌లో ‘నియర్ ఎస్టేట్’ సరికొత్త మైలురాయి!

ఈ కేసుపై తాము విచారణకు ఎలాంటి అభ్యంతరం చెప్పమని, నిజానిజాలు బయటపడాలంటే సీబీఐ విచారణకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. ‘CB-CID కాదు, సీబీఐ విచారణ జరిగినా మాకు భయంలేదు. చట్టాన్ని మేం గౌరవిస్తాం, కానీ రాజకీయ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేయడం తగదని గండ్ర వెంకట రమణ రెడ్డి పేర్కొన్నారు. ఈ కేసుపై మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో స్పష్టమవుతాయని, రాజకీయం చేయకుండా నిజాలు బయటకు రావటానికి సహకరించాలనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.