BRS Chief: నేడు గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణస్వీకారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానం పలికారు. నేడు స్పీకర్ ప్రసాద్ కుమార్ సమక్షంలో మధ్యాహ్నం 12:45 నిమిషాలకు కేసీఆర్ ప్రమాణం చేయనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీలోని ఎల్ఓపీ కార్యాలయం చేరుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం కేసీఆర్ బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
Read Also: Road Accident: జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనమిది మంది మృతి!
Also Read
అయితే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన రెండవ రోజే కేసీఆర్ బాత్రూంలో కాలు జారి పడటంతో తుంటి ఎముక విరిగడంతో యశోద ఆసుపత్రిలో చికిత్స చేశారు. తుంటి ఆపరేషన్ కావడంతో డాక్టర్ల సూచన మేరకు కేసీఆర్ గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకున్నారు. ఇక, ఇటీవల కాలంలో కర్ర సహాయంతో కేసీఆర్ మెల్లిగా నడుస్తున్నారు. ఈ క్రమంలో నేడు ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన మూడు శాసనసభ ఎన్నికలలో కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే, రెండు పర్యాయాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలన చేశారు. కానీ ఈ సారి మాత్రం కేవలం ఎమ్మెల్యేగానే పరిమితం కాబోతున్నారు.
- Tags
- BRS Chief
- gajwel mla
- kcr
- Oath
- telangana
తాజావార్తలు
-
Rambha Urvashi Menaka Teaser: అల్లరి నరేష్ కామెడీకి దేవకన్యలు తోడైతే.. టీజర్లో అసలు కథ ఇదే!
-
Astrology: ఆగస్టు 12 బుధవారం దినఫలాలు..
-
Suriya: నా ఆరు నెలల హైదరాబాద్ ప్రయాణం మరచిపోలేను
-
Naga Vamsi : ‘విశ్వనాథ్ & సన్స్’తో సంజయ్ రామస్వామి మ్యాజిక్ రిపీట్
-
CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్‌కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..