Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Brs Chief Kcr Slams Congress Party

BRS Chief: కాంగ్రెస్పై వ్యతిరేకతను బీఆర్ఎస్ పార్టీ సద్వినియోగం చేసుకోవాలి

Published Date :March 4, 2024 , 5:09 pm
By Chandra Shekhar Pamena
BRS Chief: కాంగ్రెస్పై వ్యతిరేకతను బీఆర్ఎస్ పార్టీ సద్వినియోగం చేసుకోవాలి
  • Follow Us :
  • google news
  • dailyhunt

KCR: తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన మహబూబాబాద్, ఖమ్మం లోక్ సభ నియోజకవర్గ సమీక్ష సమావేశం ముగిసింది. ఈ మీటింగ్ లో ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ లో మాలోతు కవితలకు మరోసారి పోటీకి అవకాశం ఇవ్వాలని ఏకగ్రీవంగా నేతలు తీర్మానించారు. ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికల ఇంచార్జ్ గా పల్లా రాజేశ్వర్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డిలను కేసీఆర్ నియమించారు.

Read Also: KCR: ఇద్దరు లోక్ సభ అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్..

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. త్వరలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఉంటుందని నేతలకు తెలిపారు. జిల్లాలో పార్టీ ఓడిపోయినా నేతలు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి.. పార్టీ వీడిచి వెళ్లే నేతలతో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదు అని పేర్కొన్నారు. ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు సమన్వయకర్తలను నియమిస్తాము.. ఎన్టీఆర్ లాంటి నేతకు రాజకీయాల్లో ఒడిదుదుకులు తప్పలేదు.. మనమెంత మనకు ఒడిదుడుకులు వస్తాయి.. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా ఉన్న టీడీపీ ఘోరంగా ఓడిపోయింది.. తిరిగి మళ్లీ పుంజుకుంది అని ఆయన చెప్పుకొచ్చారు. మనం ప్రజలకు చేయాల్సింది చేశాము.. అయినా ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు.. ప్రజలకు మన విలువ తెలుస్తుంది అని కేసీఆర్ పేర్కొన్నారు.

Read Also: Top Headlines@5PM: టాప్‌ న్యూస్

ఇక, కాంగ్రెస్ పార్టీపై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత మొదలయింది అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. దళితబంధు ఎన్నికల కోసం తేలేదు.. ఒక విజన్ కోసం తెచ్చాను.. కాంగ్రెస్ పై వ్యతిరేకతను బీఆర్ఎస్ పార్టీ సద్వినియోగం చేసుకోవాలి అని ఆయన సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి పని చేస్తే గెలుస్తాం అని చెప్పుకొచ్చారు. ఇక, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతిపక్షాల రుచి చూపించాలి అని కేసీఆర్ వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS Chief
  • Congress Party
  • kcr
  • Parliament Elections 2024
  • telangana

తాజావార్తలు

  • Tollywood: సమ్మర్‌ అంటే ఎందుకంత భయం?

  • The Original Hitman: అప్పట్లోనే ఒకడు ఉండేవాడు.. 500 సిక్సర్లతో రోహిత్‌శర్మను మించిన హిట్‌మ్యాన్ ఇతను!

  • LPG Gas: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై మరో బిగ్ అప్‌డేట్..

  • Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..

  • Dacoit: ‘డెకాయిట్’ సెన్సార్ రివ్యూ

ట్రెండింగ్‌

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • HPV వైరస్ అలర్ట్.. చిన్న వయస్సులోనే టీకా తీసుకోకపోతే క్యాన్సర్ ముప్పు.!

  • 50MP సోని కెమెరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్ తో Moto G Stylus (2026) లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions