Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress 1000 Days: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోని వైఫల్యాలను ఎత్తిచూపుతూ తెలంగాణ భవన్లో ఛార్జ్‌షీట్‌ను విడుదల చేయనున్నట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
‘ఇది పాలన కాదు.. పీడన’ :
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తి కావడం ఒక ముఖ్యమైన ఘట్టమని కేటీఆర్ అన్నారు. అయితే ఈ 1000 రోజులు పాలనకు కాకుండా ప్రజలకు పీడనగా మారాయని విమర్శించారు. ‘దరిద్రం దండయాత్ర మొదలుపెట్టి వెయ్యి రోజులు అయింది. కేసీఆర్ మాటల్లో ఇది సర్వభ్రష్ట పాలన.. రేవంత్‌రెడ్డి మాటల్లో ఈ వెయ్యి రోజులు క్రిమినల్ వేస్ట్’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాలుగు తలలతో నాగుపాము బుసలు కొట్టినట్టుగా కాంగ్రెస్ పాలన సాగుతోందని కేటీఆర్ విమర్శించారు. ఇది వికృత పాలన అని, కాంగ్రెస్ ఇచ్చిన అభయహస్తం ఈ శతాబ్దపు అతిపెద్ద మోసమని ఆరోపించారు.
Also Read
- YS Jagan: 'నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను'.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
- IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
- Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్‌తో అభిమాని మృతి!
ఉద్యోగులకు హామీలు ఇచ్చి చివరకు ఉత్త చేతులు చూపించారని కేటీఆర్ విమర్శించారు. 22A పేరుతో భూములను కొల్లగొడుతున్నారని, అవినీతి అనకొండలా పాలన సాగుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాల్సిన ప్రభుత్వం ఢిల్లీ ముందు మోకరిల్లుతోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 1000 రోజుల పాలనలో రూ.4.5 లక్షల కోట్ల అప్పులు చేసిందని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఎంగిలి ఆకుల దగ్గర కుక్కలు కొట్లాడుకున్నట్టుగా పరస్పరం గొడవపడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘వైఫల్యాలపై ఛార్జ్‌షీట్ విడుదల చేస్తున్నాం’ :
మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేసిన వైఫల్యాలపై ఛార్జ్‌షీట్ విడుదల చేస్తున్నామని తెలిపారు. 100 రోజుల్లో హామీలను నెరవేరుస్తామని చెప్పి.. వెయ్యి రోజులు పూర్తయినా వాటిని అమలు చేయలేకపోయారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి తలమానికంగా తీర్చిదిద్దారని హరీశ్‌రావు అన్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క వ్యవస్థ కుప్పకూలుతోందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ఒక్కో రంగాన్ని ఎంతో అభివృద్ధి చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేస్తోందని హరీశ్‌రావు విమర్శించారు. పురోగమనం వైపు వెళ్లాల్సిన తెలంగాణను తిరోగమనం దిశగా తీసుకెళ్తున్నారని ఆరోపించారు.
తాజావార్తలు
-
Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
-
YS Jagan: ‘నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను’.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
-
Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
-
BRB First Look: కిచ్చా సుదీప్ బర్త్‌డేకు అదిరిపోయే ట్రీట్.. మంచు ప్రపంచంలో మాస్ అవతార్!
-
Mamitha Baiju: ఆస్పత్రిలో చేరిన మమితా బైజు.. అభిమానుల్లో ఆందోళన! అసలు ఏమైందంటే
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!