NTV Telugu Site icon

Bro Movie Run Time: ‘బ్రో’ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్.. రన్ టైమ్ ఎంతంటే?

Bro Movie

Bro Movie

Pawan Kalyan and Sai Dharam Tej Movie Censor Certificate, RunTime: ‘పవర్​ స్టార్’ పవన్​ కల్యాణ్​, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమా​ ‘బ్రో’. బ్రో సినిమాలో కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్స్​గా నటించారు. తమిళ సినిమా ‘వినోదయ సీతం’ సినిమాకు ఇది రీమేక్​. ఒరిజినల్​లో ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సముద్రఖనినే.. బ్రో సినిమాను తెరకెక్కించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్​లో టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఒరిజినల్​ స్టోరీలో మార్పులు చేసి తెలుగు నెటివిటీకి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే, మాటలు అందించారు.

కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా ఎమోషన్స్​తో కూడిన ‘బ్రో’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జులై 28న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్​లో వేగం పెంచింది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబందించిన సెన్సార్ సర్టిఫికెట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్రో సినిమాకు సెన్సార్ బోర్డు ‘యూ’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక ఈ సినిమా రన్ టైమ్ 2 గంట 14 నిమిషాలు (134.30 నిమిషాలు)గా ఉంది.

Also Read: West Indies ODI Squad: భారత్‌తో వన్డే సిరీస్‌.. వెస్టిండీస్ జట్టు జట్టు ప్రకటన! విధ్వంసకర ప్లేయర్ రీ ఎంట్రీ

సమయం లేదంటూ నిత్యం ఉరుకులు, పరుగులు పెట్టే ఓ వ్యక్తి యాక్సిడెంట్‌ అయి చనిపోతాడు. ఆ చనిపోయిన వ్యక్తికి మరిన్ని రోజులు బతికేందుకు సమయం ఇస్తే.. ఏం చేశాడన్నదే బ్రో సినిమా కథ. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గాడ్‌గా కనిపించనుండగా.. కామన్ మ్యాన్‌ పాత్రలో సాయి ధరమ్ తేజ్ నటించారు. పవన్, సాయి తేజ్ కలసి నటించిన ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

బ్రో సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్, పోస్టర్ భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. గత శనివారం రిలీజైన బ్రో ట్రైలర్ యూట్యూబ్​లో ట్రెండింగ్​లో నిలిచింది. కేవలం 45 నిమిషాల్లోనే మిలియన్​ వ్యూస్​తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందాన్ని కమెడియన్ పాత్రలో చూడబోతున్నాము.

Also Read: Lizard in Mouth: నోట్లో బల్లిపడి బాలుడు మృతి.. అసాధ్యం అంటోన్న జంతు నిపుణులు!