NTV Telugu Site icon

Viral video: బ్రిటీష్ పర్యాటకులపై బౌన్సర్ల దాడి.. పలువురికి గాయాలు

Beke

Beke

థాయ్‌లాండ్‌లో దారుణం జరిగింది. బ్రిటీష్ పర్యాటకులపై బౌన్సర్లు దాడికి తెగబడ్డారు. వారిపై ఇష్టానుసారంగా దాడికి తెగబడ్డారు. దీంతో పలువురు గాయాలు పాలయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది.

ఇది కూడా చదవండి: Man Stomach: అది కడుపా లేక.. గ్యారేజా.. వ్యక్తి కడుపులో గోళ్లు, సూదులు, బోల్ట్‌లు..

పట్టాయాలోని బార్‌లో డ్రింక్స్ బిల్లుపై వివాదం చెలరేగింది. దీంతో ఘర్షణ చోటుచేసుకుంది. సెక్యూరిటీ గార్డు తలపై తన్నడంతో బ్రిటిష్ టూరిస్ట్ కోమాలోకి వెళ్లాడు. ఈ వీడియో కాస్త పోలీసులకు చేరింది. కానీ ఎవరూ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. సెక్యూరిటీ గార్డులను పోలీసులు హెచ్చరించి వదిలేశారు. అధికారిక ఫిర్యాదు లేకపోవడంతో ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బార్ హోస్టెస్‌తో ముగ్గురు బ్రిటీష్ పురుషులు బిల్లు విషయంలో తగాదా పడ్డారు. తాము మోసపోయామని బిల్లు చెల్లించేందుకు నిరాకరించారు. దీంతో వివాదం చెలరేగి కొట్లాటకు దారి తీసింది. పర్యాటకులలో ఒకరు సెక్యూరిటీ గార్డును నెట్టడంతో బార్ వెలుపల గొడవ జరిగింది. అనంతరం దారుణంగా బ్రౌన్సర్లు దాడికి తెగబడ్డారు.

ఇది కూడా చదవండి: PM Modi: ఎన్నికల ఫలితాలకు ముందు 2 రోజులు మోడీ ధ్యానం.. ఎక్కడంటే..!

బౌన్సర్లు.. బ్రిటీష్ పురుషులపై దాడి చేయడం వీడియోలో కనిపించింది. ఒక పర్యాటకుడు నేలపై పడుకుని రక్షణ కోసం వేడుకున్నాడు. ఒక బౌన్సర్.. టూరిస్ట్ తలపై దాడి చేశాడు. బాధితుడు కొన్ని నిమిషాల పాటు నేలపై అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. టూరిస్ట్ ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్‌లో  ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బాధితులు ఫిర్యాదు చేస్తే.. నిందితుల్ని అరెస్ట్ చేస్తామని పోలీసులు అంటుకున్నారు.