NTV Telugu Site icon

Britain- Ukraine: ఉక్రెయిన్కి మద్దతుగా ఐరోపా దేశాలు.. బ్రిటన్ భారీ సాయం

Ukrine

Ukrine

Britain- Ukraine: అమెరికా పర్యటనను అర్ధంతరంగా క్లోజ్ చేసుకుని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ షెడ్యూల్‌ కంటే ఒక రోజు ముందుగా మార్చ్ 1వ తేదీన బ్రిటన్‌ కు వెళ్లారు. యూకే ప్రధాని కీర్‌ స్టార్మర్‌ తన అధికార నివాసం 10, డౌనింగ్‌ స్ట్రీట్‌ దగ్గర ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు బ్రిటన్‌ ఇక ముందు కూడా అన్ని విధాలా అండగా నిలుస్తుందని ప్రధాని స్టార్మర్‌ వెల్లడించారు. ఈ సందర్భంగానే ఉక్రెయిన్కి భారీ రుణాన్ని ఇవ్వబోతున్నట్లు బ్రిటన్ ప్రకటించింది.

Read Also: Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌!

అయితే, మూడేళ్లుగా తమకు బ్రిటన్‌ అందిస్తున్న మద్దతుకు ఉక్రెయిన్ అధినేత జెలెన్‌స్కీ కృతజ్ఞతలు చెప్పారు. ఇక, ఉక్రెయిన్‌ యుద్ధంపై అమెరికా వైఖరిలో వచ్చిన పెను మార్పుతో పాటు అధ్యక్షుడు ట్రంప్‌ వ్యవహార శైలి తదితరాలు అంశాలపై ఇద్దరు చర్చించినట్లు సమాచారం. ఈరోజు (మార్చ్ 02) లండన్‌లో యూరప్‌ నేతల సమావేశం జరగనుంది. అందులో జెలెన్‌స్కీ పాల్గొనే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌ యుద్ధం, యూరప్‌ భద్రతే ప్రధాన అజెండాగా ఈ మీటింగ్ లో చర్చించే ఛాన్స్ ఉంది. నిజానికి మార్చి 6వ తేదీన పారిస్‌లో యూరప్‌ శిఖరాగ్ర సదస్సు జరగబోతుంది. అంతకు కేవలం రెండు రోజుల ముందు స్టార్మర్‌ ఆహ్వానంపై యూరప్‌ దేశాధినేతలంతా లండన్‌లో సమావేశం కానుండటం పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.