Brij Bhushan: బ్రిజ్‌భూషణ్ హల్చల్.. కొడుకు నామినేషన్ వేళ 10 వేలమంది అనుచరులు, 700 వాహనాలతో ర్యాలీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కైసర్‌గంజ్ ఎంపీ టికెట్ ను ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ కు బీజేపీ కేటాయించింది. దీంతో శుక్రవారం నాడు కరణ్ నామినేషన్ వేయడానికి వచ్చిన సందర్భంగా ఆయన తన అనుచరగణంతో హల్ చల్ చేశారు. నామినేషన్‌కు ముందు నిర్వహించిన సభకు 10 వేలమంది పాల్గొన్నారు. వారిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్లు, బీజేపీ స్థానిక నేతలు ఉన్నారు. అలాగే 500-700 వరకు వాహనాలు మైదానంలో పార్క్ చేసినట్లు నేషనల్ మీడియాలో న్యూస్ టెలికాస్ట్ చేశారు.
Read Also: Mallu Bhatti Vikramarka: సింగరేణి నీ కాపాడుతాం.. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళనివ్వం..
Also Read
- Mithali Raj: 'నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు'.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
- Mithali Raj: 'సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..' పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
- Suryakumar Yadav: ‘నా వంతు కృషి చేస్తున్నా’.. టీమిండియాలోకి రీఎంట్రీపై కీలక వ్యాఖ్యలు..!
- OdalaRevu Fishermens: చుట్టూ చీకటి.. చాలా భయమేసింది.. 23 రోజులు నరకయాతన అనుభవించాం!
కాగా, ఈ వేదికపై అంతా కుర్చీల్లో కూర్చోగా.. బ్రిజ్ భూషణ్ మాత్రం ఒక రాజులా మధ్యలో ఒక సోఫాలో కూర్చుండిపోయారు. చేతిలో మైక్రోఫోన్ పట్టుకొని అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నామినేషన్ ప్రక్రియకు తన పెద్ద కుమారుడు, అలాగే, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు మాత్రం దూరంగా ఉండిపోయారు. ఇక, కరణ్ కుమార్ నామినేషన్ వేసేప్పుడు కూడా కార్యాలయం లోపలకు వెళ్లేందుకు ఐదుగురికి మాత్రమే పర్మిషన్ ఉంది. అయితే, కైసర్‌గంజ్ లోక్‌సభ స్థానానికి వరుసగా మూడుసార్లు ఎంపీగా బ్రిజ్‌భూషణ్ విజయం సాధించారు.
Read Also: Osmania University : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మరో 4 కొత్త కోర్సులు
అయితే, గతేడాది జనవరిలో సాక్షి మలిక్, బజ్రంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ సహా అగ్రశ్రేణి రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ.. పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో ఆయనపై బీజేపీలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలోనే తాజా ఎన్నికల్లో కమలం పార్టీ ఆయనను పక్కన బెట్టి.. తన కుమారుడికి టికెట్ కేటాయించింది. కాగా, యూపీలోని గోండా చుట్టుపక్కల ఆరు జిల్లాల్లో ఆయన హవా నడుస్తుండటంతో బీజేపీ బ్రిజ్ భూషణ్ కుటుంబానికి మద్దతుగా ఉంటుంది.
తాజావార్తలు
-
Yamaha YZF-R2: R15 కంటే మరింత పవర్ఫుల్! 26.1bhp పవర్‌తో కొత్త Yamaha YZF-R2 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Rakhi Special: రక్షా బంధన్ పండుగకి ఇంట్లోనే ఓటీటీలో ఫ్యామిలీతో చూడాల్సిన 7 బెస్ట్ సినిమాలు
-
China Earthquake: చైనాలో భారీ భూకంపం.. సిచువాన్‌లో 5.1 తీవ్రతతో ప్రకంపనలు, నేపాల్‌లో మరోసారి వరద భయం!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!