NTV Telugu Site icon

Bhatti Vikramarka: విద్యుత్ రంగంలో అరాచకం సృష్టించారు..

Batti

Batti

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 6వ రోజు కొనసాగుతున్నాయి. ఈ రోజు సభలో విద్యుత్ రంగంపై స్పల్పకాలిక చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. విద్యుత్ రంగంపై పరిస్థితిని ప్రజలకు తెలియజేయాలని అన్నారు. గత ప్రభుత్వం 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ ప్రాజెక్ట్ మాత్రమే పూర్తి చేసింది.. రాష్ట్ర విద్యుత్ రంగ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. ఇప్పటి వరకు విద్యుత్ రంగంలో 81 వేల 516 కోట్ల అప్పు ఉందని పేర్కొన్నారు. డిస్కంలకు ప్రభుత్వం శాఖల బకాయిలు 28, 842 కోట్లు.. సాగునీటి శాఖ చెల్లించాల్సిన బాకీనే 14, 193 కోట్లు.. రూ.14, 928 కోట్ల భారం డిస్కంల ఆర్థికస్థితిని మరింత కుంగదీశాయని భట్టి విక్రమార్క అన్నారు.

Read Also: Student Letter: తెలంగాణ సీఎంకు 5వ తరగతి విద్యార్థిని లేఖ.. ఎందుకో తెలుసా..!

వ్యవసాయంకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి తాము కట్టుబడి ఉన్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. విద్యుత్ రంగంలో తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు ఇవ్వండని అన్నారు. గత ప్రభుత్వం విద్యుత్ రంగంలో అరాచకం సృష్టించారని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. డిస్కంలకు బకాయిలు భారంగా ఉన్నాయని భట్టి విక్రమార్క తెలిపారు. అనంతరం శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. 2014 నుండే ప్రజలు కరెంట్ చూసినట్టు.. బీఆర్ఎస్ వచ్చే తెలంగాణకి వెలుగులు ఇచ్చినట్టు మాట్లాడుతున్నారని తెలిపారు. 2014 కంటే ముందు ఎలా ఉందో మేము కూడా చెప్తామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ వేశారు. అనంతరం.. జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, తాను 10వ తరగతి చదివినప్పటి నుండి.. మా పిల్లలు పదో తరగతి కూడా కిరసనాయిల్ దీపం కిందనే చదివారు.. శ్రీధర్ బాబు కూడా అట్లనే చదువుకున్నాడని తెలిపారు.

Read Also: Prabhas : పోలీస్ ఆఫీసర్ గా సరికొత్త గెటప్ లో రెబల్ స్టార్..!