Site icon NTV Telugu

Brian Lara: అతనో గొప్ప ఆటగాడు.. త్వరలో టెస్టుల్లో చూడాలనుకుంటున్న.. విండీస్ దిగ్గజ ప్లేయర్ హాట్ కామెంట్స్

Lara

Lara

Brian Lara: భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ, ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ 1 బ్యాటర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆసియా కప్ 2025లో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన ఈ యువ ఆటగాడు ఇప్పుడు వన్డే ఫార్మాట్‌లోకి కూడా అడుగుపెట్టే అవకాశం ఉందని సమాచారం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లు ఇంకా జట్టులో ఉన్నప్పటికీ, త్వరలోనే అభిషేక్ కూడా ఆ జట్టులో స్థానం సంపాదించే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, అభిషేక్ అసలైన లక్ష్యం మాత్రం భారత్ టెస్ట్ జట్టులో సుస్థిర స్థానం సంపాదించడం. దీనికోసం అతడు వెస్టిండీస్ లెజెండ్ బ్రియన్ లారాకు తరచుగా కాల్ చేసి సలహాలు తీసుకుంటున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో కలిసి పనిచేసిన రోజులలోనే లారాకు అభిషేక్‌పై మంచి అభిప్రాయం ఏర్పడింది.

Mask Man Harish : మీరు బండ ఆంటీనా.. రిపోర్టర్ పై మాస్క్ మ్యాన్ ఫైర్

ఈ విషయం గురించి తాజాగా లారా మాట్లాడుతూ.. “తాను అభిషేక్‌ను SRHలో ఉన్నప్పుడే పరిచయం అయ్యాను. కోవిడ్ కాలంలో ఆ జట్టులో చాలా మంచి యువ ఆటగాళ్లు ఉన్నారు. అందులో అభిషేక్ ఒక ప్రత్యేకమైన టాలెంట్. యూవరాజ్ సింగ్ అతని ఆటపై పెద్ద ప్రభావం చూపించాడు. అతని బ్యాట్ స్పీడ్, షాట్ ప్లేస్‌మెంట్, బాల్‌ను సరిగ్గా హిట్ చేసే విధానం అన్ని అద్బుతంగా ఉంటాయని కొనియాడారు.

Cardamom Benefits: నిద్రలేమి సమస్యలతో ఇబ్బందులా? అయితే ఇలా ట్రై చేయండి!

అతను ఇప్పుడే T20 క్రికెట్‌లో విజయవంతంగా ఉన్నా, ఇప్పటికీ నన్ను సంప్రదించి టెస్ట్ జట్టులోకి ఎలా ప్రవేశించాలో తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఈ దృష్టి, ఈ పెద్ద ఆలోచన చాలా ప్రత్యేకమైనది. నేను అతని ఆటను ఎంతో ఇష్టపడుతున్నాను. అతను రోజురోజుకు మెరుగుపడుతూ, కొత్త స్థాయికి చేరుకుంటున్నాడని అన్నారు. టెస్ట్ క్రికెట్‌లో అవకాశాల కోసం కృషి చేస్తున్న అభిషేక్ శర్మకు ఇది అతని సంకల్పం, నిబద్ధత ఆల్‌ఫార్మాట్ ప్లేయర్‌గా ఎదగాలన్న దృఢ సంకల్పం అర్థమవుతుంది.

Exit mobile version