Cardamom Benefits: నిద్రలేమి సమస్యలతో ఇబ్బందులా? అయితే ఇలా ట్రై చేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cardamom Benefits: రోజంతా కాస్పది పనిచేసి అలసిపోయి రాత్రి మంచంలో పడుకున్నా నిద్ర రాకపోవడం, భోజనం తర్వాత ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలతో ఇబ్బంది పడటం.. ఇవన్నీ చాలా మందికి సాధారణ సమస్యలే. కానీ వీటి పరిష్కారం ఎక్కడో కాదు, మన వంటగదిలోనే దాగి ఉంది. అదే యాలకులు (Green Cardamom). వంటకాలకు సువాసన, రుచి పెంచే గింజలు ఆరోగ్యానికి కూడా అద్భుతమైన మంత్రంలా పనిచేస్తాయి. ప్రతి రాత్రి భోజనం తర్వాత కేవలం రెండు యాలకులు నమిలితే మీ శరీరానికి అనేక విధాలుగా లాభం కలుగుతుంది. మరి ఆ లాభాలేంటో చూద్దామా..
ఆధునిక ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా జీర్ణ సమస్యలు పెరుగుతున్నాయి. యాలకులు జీర్ణ ఎంజైమ్‌లను ఉత్ప్రేరేపిస్తాయి. దీనివల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. గ్యాస్, ఉబ్బరం, ఆమ్లత్వం వంటి ఇబ్బందులను తగ్గించి కడుపు తేలికగా అనిపించేలా చేస్తాయి. భోజనం తర్వాత యాలకులు నమలడం వల్ల నోటి దుర్వాసన తక్షణమే తగ్గుతుంది. యాలకుల సువాసన నోరు తాజాగా ఉంచి, బ్యాక్టీరియాను చంపే యాంటీ బాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది.
Also Read
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
Baahubali Epic : బాహుబలి-3పై నిర్మాత క్లారిటీ.. సర్ ప్రైజ్..
అలాగే నిద్ర పట్టకపోవడం వల్ల ఒత్తిడి, చిరాకు వంటి సమస్యలు తలెత్తుతాయి. యాలకుల్లో ఉండే సహజ రసాయనాలు సెరోటోనిన్ స్థాయిలను పెంచి, మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. దీని వలన నిద్ర సహజంగా, ప్రశాంతంగా వస్తుంది. అంతేకాకుండా యాలకుల్లో ఉండే పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును సంతులనం చేయడంలో సహాయపడతాయి. రాత్రి భోజనం తర్వాత యాలకులు నమలడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.
Shocking News: ఎవడు సుధా వీడు.. లవర్ ను చంపి… సమాధిపైనే రెండ్రోజులు
ఇకపోతే బరువు తగ్గాలని ప్రయత్నించే వారు రాత్రి యాలకులు తినడం అలవాటు చేసుకోవచ్చు. యాలకుల్లో ఉన్న యాంటీఆక్సిడెంట్లు శరీర జీవక్రియను వేగవంతం చేస్తాయి. ఇవి కొవ్వును కరిగించేందుకు సహాయాన్ని పెంచుతాయి. అలాగే శరీరంలో ఉన్న విషపదార్థాలను బయటకు పంపి శరీరాన్ని శుద్ధి చేస్తాయి. జీర్ణక్రియ సరిగ్గా లేకపోవడం, నిద్రలేమి, అధిక బరువు, నోటి దుర్వాసన ఇవన్నీ మన రోజువారీ జీవితంలో ఇబ్బంది కలిగించే సమస్యలు. కానీ రాత్రి భోజనం తర్వాత కేవలం రెండు యాలకులు నమలడం ద్వారా ఈ సమస్యలను సహజంగా దూరం పెట్టవచ్చు. ఇది చిన్న అలవాటు అయినా, ఫలితాలు మాత్రం పెద్దవి.
తాజావార్తలు
-
PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!