Gudivada Amarnath : యనమల రామకృష్ణుడికి మంత్రి గుడి వాడ అమర్నాథ్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. యనమల సెల్ఫ్ సర్టిఫైడ్ మేథావి అన్న మంత్రి గుడివా అమర్నాథ్.. టీడీపీ హయాంలో తెచ్చిన లక్ష 50 వేల కోట్ల రూపాయల అప్పులకు యనమల లెక్కలు చెప్పగలరా అని ప్రశ్నించారు. పన్ను నొప్పి వస్తే సింగపూర్ వైద్యం కోసం రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన యనమల రామకృష్ణుడు ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. మూడేళ్ళలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పుల రూపంలో తెచ్చిన ప్రతీ రూపాయి ప్రజలకు చేరిందని మంత్రి చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అప్పులుగా తెచ్చిన లక్ష 75 వేల కోట్లు సంక్షేమ పథకాలు రూపంలో నేరుగా ప్రజలకు చేరాయన్నారు.
Also Read : Grandmother Delivery: తల్లి అయిన నాయనమ్మ.. కొడుకు బిడ్డకు జన్మ.. ఎలాగంటే..!
ఈ మేరకు తాము చర్చకు సిద్ధమని అమర్నాథ్ ఛాలెంజ్ చేశారు మంత్రి అమర్నాథ్. అదే సమయంలో టీడీపీ హయాంలో తెచ్చిన లక్ష 50 వేల కోట్ల రూపాయల అప్పులకు యనమల లెక్కలు చెప్పగలరా అని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. ఇక, పరుశ్రమలు, పెట్టుబడులపై మాట్లాడే నైతిక హక్కు యనమలకు లేదన్నారు అమర్నాథ్. ఏపీ రూపొందించిన పాలసీ బాగుండటం వల్లే బల్క్ డ్రగ్ పార్క్ వచ్చిందని గుర్తు చేశారు. పరిశ్రమలు రావడం లేదని ఒకరోజు…..పెట్టుబడులు వస్తుంటే వ్యతిరేకంగా మరో రోజు లేఖలు రాయడం చూస్తే యనమలకు అల్జీమర్స్ ఏమైనా వచ్చిందా అనే అనుమానం కలుగుతోందని మంత్రి అమర్నాథ్ అన్నారు.